Viral Video: రోడ్డు మీద మహా యుద్ధం చేస్తున్న పిల్లులు.. రెజ్లర్ల నుంచి శిక్షణ పొందాఏమో అంటున్న నెటిజన్లు..
ప్రతిరోజూ సోషల్ మీడియా ప్రపంచంలో ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి సంచలనం సృష్టించిన వీడియో రెండు పిల్లుల మధ్య జరిగిన గొప్ప యుద్ధం. అవును ఎర్ర పిల్లి , నల్ల పిల్లి మధ్య జరిగిన ఈ పోరాటం చాలా భయంకరంగా ఉంది. ఈ పోరాటం ఏ రేంజ్ లో సాగుతుందంటే నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. దీనిని చూసిన తర్వాత ప్రజలు నవ్వుకుంటున్నారు. లక్షలాది మంది ఈ వీడియోను చూశారు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో రెండు పిల్లలు ఓ రేంజ్ లో యుద్ధం చేసుకుంటున్నాయి. ఎర్ర పిల్లి, నల్ల పిల్లి మధ్య ఏదో కుస్తీ కార్యక్రమం జరుగుతున్నట్లుగా ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. ఇలా కొట్టుకుంటూ ఒకసారి కారు కింద పడాల్సినవే.. అయితే ఆయుస్సు ఉన్నట్లు ఉంది. జస్ట్ మిస్ అయ్యాయి. అయినా సరే రెండూ రోడ్డు మధ్యలో రెజ్లర్ల మాదిరిగా పోరాడుతున్నాయి. ఒకదానికి ఒకటి ఎత్తుతూ, కిందకు విసిరేసుకుంటూ పొరాదుతున్నాయి. రోడ్డు బిజీగా ఉంది.. వాహనాలు వస్తూ పోతూ ఉన్నాయి. అయితే ఆ పిల్లలు మాత్రం తమ పోరాటాన్ని ఆపడం లేదు. వేగంగా వస్తున్నా ఒక కారుని ఈ రెండు పిల్లులు ఢీకొన్నాయి. అది చూసిన వారికి ఒక్క క్షణం గుండె దడదడలాడుతుంది.. కానీ పిల్లులు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. రెండూ మళ్ళీ రోడ్డు పక్కన చేరుకుని తమ పోరాటాన్ని కొనసాగించాయి.
ఆ మహా యుద్ధానికి అంతం లేనట్లుంది పోరాట స్ఫూర్తి ఎంత తీవ్రంగా ఉందంటే పిల్లులు కొట్టుకోవడం ఆపడం లేదు. ఎర్ర పిల్లి నల్ల పిల్లిని విసిరేస్తుంది. నల్ల పిల్లి ఎర్ర పిల్లిని చుట్టేస్తుంది. ఈ రెండు పిల్లలు WWE స్టార్ రెజ్లర్ల నుంచి శిక్షణ పొందినట్లు అనిపిస్తుంది. అప్పుడే మరో కారు రోడ్డుపైకి వచ్చింది. అయితే ఈసారి డ్రైవర్ దూరం నుంచి ఈ రెజ్లర్ పిల్లులను పచూశాడు. తెలివిగా కారును వాటి పక్క నుంచి వెళ్ళేలా చేశాడు.
వీడియోపై ఫన్నీ కామెంట్లతో స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిల్లి పోరాటం వీడియోను @german5206 అనే యూజర్ తన పేజీలో షేర్ చేశారు. పిల్లుల మధ్య జరుగుతున్న పోరాటాన్ని చూసి ప్రజలు ఆనందిస్తున్నారు. యూజర్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ రేజర్లకు శిక్షణ ఎవరు ఇచ్చారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




