AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eating Rules: నిలబడి లేదా సెల్ ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉందా.. వెంటనే గుడ్ బై చెప్పండి.. లేదంటే జీర్ణక్రియ మటాష్..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తింటే సరిపోదు. ఆహరం అంటే కడుపు నింపుకోవడం కాదు.. ఆహారాన్ని తినే సమయంలో సరైన పద్దతి పాటించాలని.. అప్పుడే తిన్న ఆహారం శరీరానికి ఔషధంగా మారుతుందని వెల్లడించింది. అంతేకాదు ఆహారాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో తినాలి. తినే సమయంలో మాట్లాడవద్దు, ఓపికగా తినడం, వంటి పద్దతుల గురించి కూడా చెప్పింది. ఆహారం తినడానికి సరైన విధానం ఏమిటంటే

Eating Rules: నిలబడి లేదా సెల్ ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉందా.. వెంటనే గుడ్ బై చెప్పండి.. లేదంటే జీర్ణక్రియ మటాష్..
Eating Rules
Surya Kala
|

Updated on: Aug 24, 2025 | 12:25 PM

Share

సనాతన హిందూ సంప్రదాయంలో ఆహార తీసుకోవడం వెనుక ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించింది. పురాతన కాలం నుంచి ఆహారాన్ని పవిత్రంగా భావిస్తారు. భోజనాన్ని ఒక పూజగా పరిగణించాలి. ఓపికగా, భక్తితో తీసుకోవాలి. అయితే గతకొంత కాలంగా ఆహరం తినే విషయంలో పాటించే పద్దతులు కూడా మసకబారుతున్నాయి. చాలా మంది ప్రజలు నిలబడి లేదా తొందర తొందరగా ఏదో తిన్నాం లే అన్నట్లు భోజనం చేస్తున్నారని అన్నారు.

సనాతన హిందూ సంప్రదాయంలో ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి గౌరవించారు. అందకనే ఆహారం తినడానికి కూడా కొన్ని నియమాలు పెట్టారు. ఈ నియమాలను అనుసరిస్తూ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. తినే ఆహారంపై పూర్తి శ్రద్ధ పెట్టాలి.. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఆహారం తినేయడం మంచిది కాదు

ఆహారాన్ని నేల మీద కుర్చుని నెమ్మదిగా తినడం, ఆహారాన్ని బాగా నమలడం, మాట్లాడకుండా తినడం వంటి నియమాలను పాటిస్తే అది ఆహారాన్ని గౌరవించడమే.

ఇవి కూడా చదవండి

పడుకుని లేదా నిలబడి అన్నం తినడం, భోజనం చేసేటప్పుడు మాట్లాడటం, ఫోన్ వాడటం లేదా మరే ఇతర పనిలో పాల్గొనడం సరైనది కాదని చెప్పారు. అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. జీర్ణ క్రియ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు ఫోన్ లేదా టీవీ చూడటం జీవితంలో పురోగతిని అడ్డుకుంటుందని నమ్ముతారు.

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆహారాన్ని దైవంగా భావించి, తినేముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, ఆహారం వృధా చేయకుండా ఉండటం వంటి నియమాలను పాటించాలి. ఇలాంటి నియమాలను పాటించే ఇంట్లో ధన ధాన్యాలకు లోటుండదని నమ్మకం. అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.

ఇక రాత్రి భోజనంలో పెరుగు, నువ్వులు తినడం మంచిది కాదు. ఎడమ చేతితో ప్లేట్ పట్టుకోకూడదు. అంతేకాదు తినే సమయంలో వీలైనంత వరకు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని తినడం మంచిదని హిందూ సంప్రదాయంలో నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.