AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రమాదకంగా ప్రవహిస్తున్న వాగు.. నవజాత శిశువు ప్రాణం కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టి వాగు దాటిన నర్స్.. వీడియో వైరల్

ఒక నర్సు ధైర్యసాహసాల వీడియో ఈ రోజుల్లో ప్రజలలో చర్చనీయాంశమవుతోంది. దీనిలో ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి నవజాత శిశువు ప్రాణాలను కాపాడటానికి ముందుకు వెళుతోంది. నన్ను నమ్మండి, ఈ నర్సును చూసిన తర్వాత.. మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు. ఆమె విధి నిర్వహణ కోసం చేసిన పనికి సలామ్ అని అంటారు.

Viral Video: ప్రమాదకంగా ప్రవహిస్తున్న వాగు.. నవజాత శిశువు ప్రాణం కోసం ప్రాణాన్ని ఫణంగా పెట్టి వాగు దాటిన నర్స్.. వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Aug 24, 2025 | 11:14 AM

Share

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇంతలో మండి జిల్లాలోని చౌహర్‌ఘాటి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఒక స్టాఫ్ నర్సు కమల రాళ్లపై దూకి పొంగి ప్రవహించే వాగును దాటుతున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ మహిళ ఇలా దూకే సమయంలో చిన్న తప్పు జరిగినా ఆమె ప్రాణాలను బలిగొనేది. అయినప్పటికీ ఆమె తన పని చేయడానికి వెళుతుంది. రెండు నెలల శిశువుకు ఇంజెక్షన్ ఇవ్వడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది స్టాఫ్ నర్స్ .

ఒక వాగు అత్యంత వేగంతో ప్రవహిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఎంత వేగంగా ప్రవహిస్తుందంటే.. వాటిలో ఏదైనా పడినా.. ఆ ప్రవాహానికి అడ్డుపడినా వాటిని ఈజీగా తమతో పాటు తీసుకుని వెళ్ళుతుంది. అటువంటి వాగు ని దాటేందుకు నర్సు నీటిలో ఉన్న బండ రాళ్లపై దూకుతూ.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. స్టాఫ్ నర్సు కమల దూకి పొంగిపొర్లుతున్న కాలువను దాటుతున్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

తన పోరాటం గురించి మాట్లాడుతూ.. తనకు సిహెచ్‌సి నుంచి అత్యవసరంగా ఫోన్ వచ్చిందని.. అక్కడికి తాను ప్రాణాలను కాపాడే మందులు ఎలాగైనా తీసుకేల్లాల్సి వచ్చిందని నర్సు చెప్పింది. నిరంతర భారీ వర్షాల కారణంగా.. ఆ ప్రాంతంలోని ఫుట్‌బ్రిడ్జి కొట్టుకుపోయింది. తన డ్యూటీ చేసే చోటకు చేరుకోవడానికి ఆమె రోజు పోరాటం చేయాల్సి వస్తోంది. నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది ప్రజలకు చేరువైన వెంటనే వైరల్‌గా మారింది. అందరూ కమలని ప్రశంసించడం మొదలు పెట్టారు. ఆమె కృషికి తగిన ప్రతిఫలం పొందాలని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో మన దేశానికి అలాంటి వ్యక్తుల అవసరం చాలా ఉందని మరొకరు రాశారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..