AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రో ట్రైన్ లో సీటు కోసం పాట్లు.. జుట్టు జుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్న స్త్రీలు..

బస్సు, మెట్రో రైలు అనే తేడా లేదు.. ఎక్కిన వెంటనే ఖాళీ సీటు కనిపించాలి. కుర్చుకోవాలి. ఇదే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే కొంతమంది తమకు సీటు దొరకకపోయినా పెద్దగా పట్టించుకోరు. అయితే కొంతమంది మాత్రం కూర్చునే సీటు కోసం కుస్తీ పట్లు పడతారు. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పవచ్చు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ మెట్రో లోపల తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సీటు కోసం ఏర్పడిన వివాదం.. ఏకంగా ఒకరినొకరు జట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు ఇద్దరు మహిళలు. ఇలా గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: మెట్రో ట్రైన్ లో సీటు కోసం పాట్లు.. జుట్టు జుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్న స్త్రీలు..
Viral Video
Surya Kala
|

Updated on: Aug 24, 2025 | 9:24 AM

Share

ఢిల్లీ మెట్రో తన ప్రయాణీకులను , సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాదు., ఎందుకంటే రైలు లోపల జరిగిన అసాధారణ సంఘటనల వీడియోలు దాదాపు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తునే ఉంటాయి. ఈ వీడియోలు తరచుగా వీక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. సోషల్ మీడియాలో చర్చకు, మీమ్స్‌కు దారితీస్తాయి. ఢిల్లీ మెట్రో రైలు లోపలజరిగిన మరో షాకింగ్ వీడియో బయటపడింది, ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం తీవ్రంగా పోరాడుతున్నట్లు కనిపిస్తోంది.

ఢిల్లీ మెట్రో రైలు లోపల మహిళలు గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు లాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒక మహిళ సీటు కోసం గొడవ పడుతుండగా..వారిలో ఒకరు మరొకరిని సీటుమీదకు తోసేశారు.. ఆపై వారిద్దరూ తమ శక్తి కొద్దీ ఒకరి జుట్టుని ఒకరు లాగడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరు మహిళలు ఒకరినొకరు లాక్కుంటున్నారు. మెట్రో రైలు తన గమ్య స్థానం వచ్చినప్పుడు తలుపు తెరుచుకుంటున్నాయి. అయినా వీరిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు వీరిని పట్టించుకోకుండా రైలు నుండి దిగుతున్నారు. అయితే మరో మహిళ జోక్యం చేసుకుని వీరిద్దరిని వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆమె కొంతసేపు ప్రయత్నించింది. అయితే వారు ఒకరి జుట్టును ఒకరు వదలలేదు. వీడియో ముగిసే సమయానికి వారి జుట్టును లాగుతూనే ఉన్నారు.

ఈ సంఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశం , సమయం తెలియలేదు, అయితే ఈ వీడియో ఢిల్లీ మెట్రో రైలు లోపల జరిగింది అని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇంటర్నెట్ వినియోగదారులు ఢిల్లీ వాసులను లక్ష్యంగా చేసుకుని రకరకాల కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం