సనాతన ధర్మాన్ని అనుసరించే హాలీవుడ్ తారలు.. విశేషంగా గణపతి, లక్ష్మీదేవికి పూజలు
భారతీయ సంస్కృతి సాంప్రదాయం, అలవాట్లు యావత్ ప్రపంచం ఆసక్తిని చూపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సనాతన ధర్మంపై అమితాశక్తిని చూపించడంమే కాదు.. హిందువుగా మారి.. ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్నారు. అలా కొంత మంది హాలీవుడ్ తారలు సనాతన ధర్మాన్ని తీసుకున్నారు. గణపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వినాయకుడు తన దైవత్వం, ఆశీర్వాదాలతో విదేశీయులతో పూజలను అందుకుంటున్నాడు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు హిందూ మతాన్ని అనుసరిస్తూ గణపతిని పూజించే చాలా మంది తారలు ఉన్నారు. ఈ రోజు హిందూ మతాన్ని స్వీకరించిన కొంతమంది హాలీవుడ్ తారల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Aug 24, 2025 | 10:56 AM

త్వరలో దేశవ్యాప్తంగానే హిందువులు ఎక్కడ ఉన్నారో అక్కడ గణేష్ చతుర్థి పండగని జరుపుకోబోతున్నారు. బొజ్జ గణపయ్య భక్తులు 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే కొంతమంది హాలీవుడ్ తారలు కూడా మన హిందూ సంస్కృతిని అనుసరిస్తారు. ముఖ్యంగా గణేశునికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలను చేస్తారు.

క్లాడియా సీస్లా ఒక జర్మన్ మోడల్ మరియు నటి. ఆమె 2009 లో హిందూ మతంలోకి మారింది. ఆమె గణేశుడి అంటే చాలా నమ్మకం. గణపతిని విశేషంగా పూజిస్తుంది. సనాతన ధర్మాన్ని అనుసరిస్తుంది.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరియల్ బ్రిటిష్ నటి ఫేమ్ లీనా హేడీ కూడా సనాతన ధర్మం అంటే అమితమైన ఇష్టం. ఆమె గణేశుడు లక్ష్మీదేవి విషయాలను అనుసరిస్తుంది. ఆమె రెండు దేవుళ్ల టాటూలను వేయించుకుంది. నటి దేవుళ్లను పూజిస్తుందని ఇది చూపించకపోయినా.. ఆధ్యాత్మిక సంబంధాన్ని చూపుతుంది.

జూలియా రాబర్ట్స్ తన 'ఇట్స్ లవ్' సినిమా షూటింగ్ తర్వాత హిందూ మతంలోకి మారారు . ఈ మతంలో తాను ఆధ్యాత్మిక సంతృప్తిని పొందానని చెప్పారు. జూలియా కాథలిక్ తల్లి , బాప్టిస్ట్ తండ్రితో పెరిగింది, కానీ ఆమె వద్ద హనుమంతుడి చిత్రం ఉంది.

ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, హిందూ ఆచారాలు తనను తన చుట్టూ ఉన్న కొత్త ప్రపంచానికి మేల్కొల్పాయని పేర్కొన్నాడు. విల్ స్మిత్ హరిద్వార్‌ను సందర్శించాడు. హిందూ ఆచారాలు, గంగా హారతిలో పాల్గొంటాడు. అతని కుమార్తె విల్లో శ్రీకృష్ణుడిని నమ్ముతుంది. ఆరాధిస్తుంది.

మైలీ సైరస్ ప్రసిద్ధ గాయని , నటి. లక్ష్మీదేవిని పూజిస్తుంది. ఇలా పూజ చేస్తున్న ఆమె ఫోటో వైరల్ అయిన తర్వాత.. ఆమె మోక్షం, మానసిక ప్రశాంతత కోసం కొన్ని హిందూ ఆచారాలను పాటిస్తున్నట్లు వెల్లడించింది.

ఎక్స్ మెన్ పాత్ర పోషించే హ్యూ జాక్‌మన్‌కు హిందూ మతం పట్ల బలమైన ఆసక్తి ఉంది. భగవద్గీత, హిందూ ఉపనిషత్తులను చదువుతాడు. అతను అనేక ఇంటర్వ్యూలలో ఆధ్యాత్మికత పట్ల తనకున్న ఇష్టాన్ని అంగీకరించాడు.

సిల్వెస్టర్ స్టాలోన్ - ఈ హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ తన మరణించిన తర్వాత తన కొడుకు శ్రాద్ధకర్మలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించాడు. హిందూ ఆచారాలను అనుసరించడం వలన మానసిక ప్రశాంతతను కలిగినట్లు చెప్పాడు. అప్పటి నుంచి హిందూ సంప్రదాయాలు, ఆచారాలను పాటించడం ప్రారంభించాడు.

మడోన్నా - పాప్ ఐకాన్ పాశ్చాత్య సంస్కృతి స్వరూపం. మడోన్నా కు హిందూ సంస్కృతి అంటే అత్యంత ఇష్టం. ఆమె తరచుగా భగవంతుడికి పూజ చేస్తుంది..హారతిలో పాల్గొంటుంది. హిందూ మతంతో సహా ఆసియా మతాల గురించి తెలుసుకోవడానికి అమితాశక్తి చూపించడం ప్రారంభించింది.




