మహావతార్ నరసింహ మహాద్భుతం.. పబ్లిసిటీ లేకపోయినా కంటెంట్ తో కాసుల వర్షం.. రూ. 300 కోట్ల కలెక్షన్ వైపు పరుగు
ఇంతింతై వటుడింతై అంటూ శ్రీ మహా విష్ణువు అవతారమైన వామనావతారం గురించి చెబుతారు. అదే విధంగా ఇప్పుడు మహా మహావతార్ నరసింహ గురించి కూడా వర్ణించాలేమో.. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన మహావతార్ నరసింహ సినిమా ఊహించిన దానికంటే ప్రేక్షకుల ఆదరణని సొంతం చేసుకుంది. మహావతార్ నరసింహ ఇది కేవలం సినిమా కాదు.. భక్తి యాత్ర. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తప్పక చూడదగ్గ దైవీయ అనుభవం అంటూ కేవలం మౌత్ పబ్లిసిటీతో బాక్సాఫీస్ వద్ద కలేక్షన్ల వర్షం కురిపిస్తోంది. రోజు రోజుకీ కలెక్షన్లు తగ్గడానికి బదులుగా పెరుగుతూనే ఉన్నాయి.
భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా మహావతార్ నరసింహ నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా 30 రోజుల వసూళ్ల గణాంకాలు వచ్చాయి. ఈ చిత్రం ఇప్పటికీ సత్తా చూపిస్తోంది. ఏదైనా సినిమా విజయం సాధించాలంటే భారీ బడ్జెట్‌లో సినిమా తీయాల్సిన అవసరం లేదని మహావతార్ నరసింహ చిత్ర యూనిట్ నిరూపించింది. కేవలం 4 కోట్లతో తీసిన యానిమేటెడ్ చిత్రం.. నేడు భారీ బడ్జెట్ సినిమాతో పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా ఒక నెలలోనే సత్తా చాటింది. భవిష్యత్ లో అద్భుతాలు చేయడానికి రెడీ అవుతుంది. దీనితో పాటు ఈ చిత్రం 300 కోట్ల కలెక్షన్లకు ఎంత దూరంలో ఉందో కూడా తెలుసుకుందాం..
భారతదేశంలో ఎంత కలెక్షన్ వచ్చిందంటే
సక్కనిల్క్ నివేదికల ప్రకారం.. మహావతార్ నరసింహ భారతదేశంలో భిన్నమైన ఆరాను సొంతం చేసుకుంది. విడుదలైన 5 రోజుల తర్వాత ఈ చిత్రం 4 కోట్ల మార్కును దాటింది. ఆ సమయంలో ఈ చిత్రం 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రం 30 రోజుల్లో భారతదేశంలో మొత్తం 225.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకూ రూ. 262.70 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ఈ చిత్రం మొదటి రోజున 1.75 కోట్లు మాత్రమే సంపాదించింది. ఇప్పుడు 30వ రోజు.. మొదటి రోజు కంటే 3 రెట్లు ఎక్కువ కలెక్షన్ సంపాదించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్షన్ ఉంది?
మహావతార్ నరసింహ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటే.. మొదట్లో విదేశాల్లో పెద్దగా కలెక్షన్ రాబట్టలేక పోయింది. తరువాత సినిమా పుంజుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు రూ. 24 కోట్లకు చేరుకున్నాయి. సకానిక్ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు రూ. 286.70 కోట్లుగా చెబుతున్నారు. దీనికి భారతదేశంలో ఈ సినిమా 30వ రోజు వసూళ్లను కలిపితే, ఈ సినిమా కలెక్షన్లు రూ. 291.45 కోట్లకు చేరుకున్నాయి.
300 కోట్లకి ఎంత దూరంలో ఉన్నదంటే
4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా విడుదలైన 30 రోజుల్లో 291.45 కోట్లు రాబట్టింది. ఈ సినిమా 300 కోట్లు కలెక్షన్ క్లబ్ లో చేరుకోవాలంటే ఇంకా 9 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ సినిమా ఆదివారం కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.. కనుక మహావతార్ నరసింహ త్వరలో 300 కోట్ల కలెక్షన్లను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తోంది.
మహావతార్ నరసింహ సినిమా ఒక పౌరాణిక గాథ కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రవాహం. భక్తులు, ధార్మిక ప్రేమికులు తప్పనిసరిగా చూడవలసిన చిత్రం. నరసింహుడి రూపాన్ని తెరపై చూడటం ఒక దివ్యానుభూతి. ఇలాంటి పౌరాణిక చిత్రాలు నేటి తరానికి.. తెలియని ధర్మం, భక్తి, , నైతికత పట్ల ఆసక్తిని పెంచుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








