ఏనుగుకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా..? వణుకుపుట్టించే వీడియో..
సుశాంత నందా అనే అడవిశాఖాధికారిణి పంచుకున్న వీడియోలో, ఒక కోపంగా ఉన్న ఏనుగు తన బలంతో రోడ్డు మీద ఉన్న మినీ ట్రక్కును పక్కకు నెట్టివేసింది. ఈ ఘటన ఏనుగుల శక్తిని, వాటికి వచ్చే ఆవేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఏనుగులు ఎంత శాంతంగా ఉంటాయో, కోపించినప్పుడు అంతే ప్రమాదకరం అని గుర్తుంచుకోవాలి.

ఏనుగులు ఎంత శాంతంగా ఉంటాయో.. వాటికి కోపం వస్తే అంతే క్రూరంగా మారిపోతాయి. ఆ సమయంలో వాటి ముందు ఉన్నవారి కథ ముగిసినట్లే. అడవి ఏనుగులు కోపంగా ఉన్నప్పుడు, వాటిని నియంత్రించడం చాలా కష్టం. ఏనుగులు విధ్వంసం సృష్టించే వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కానీ ఇప్పుడు, సుశాంత నందా షేర్ చేసిన క్లిప్‌లో ఒక ఏనుగు ఒక మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిణి సుశాంత నందా ఈ వీడియోను సుశాంతానంద అనే తన X ఖాతాలో షేర్ చేసి, అసలు సత్యాన్ని క్యాప్షన్‌లో రాశారు.
ఈ పనిలో ఏనుగు బలాన్ని మాత్రమే కాకుండా ఒత్తిడిని కూడా ప్రతిబింబిస్తోంది. వన్యప్రాణులు వినోదం కోసం కాదని, వాటిని ఎటువంటి సమస్యలు లేకుండా జీవించడానికి అనుమతించాలని ఆమె రాశారు. ఈ వీడియో ట్రాఫిక్ లేని దట్టమైన పచ్చదనంతో కప్పబడిన రోడ్డుపై రికార్డ్ చేయబడింది. ఈ వీడియోలో ఒక ఏనుగు తన శక్తినంతా ఉపయోగించి రోడ్డు మధ్యలో ఉన్న మినీ ట్రక్కును పక్కకు నెట్టేసింది.
A reminder from the wild…. An elephant hurling a mini truck shows not just strength, but also stress. Wildlife is not entertainment- it deserves space & respect.
Stay away & stay safe. Let the wild roam free. pic.twitter.com/fom7cZB3xX
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) August 23, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
