Optical illusion: మైండ్ బ్లోయింగ్ పజిల్.. మీరు జీనియస్ అయితే కనిపెట్టండి చూద్దాం..!
మనసును పరీక్షించే పజిల్స్ ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్పాట్ ద డిఫరెన్స్ పజిల్స్ అయితే ఫుల్ ఫన్. ఇవి కేవలం టైమ్ పాస్ కోసమే కాదు.. మీ ఫోకస్, మెమరీ, ఐక్యూ లెవల్స్ ను టెస్ట్ చేసే సూపర్ ట్రిక్స్ కూడా. ఈసారి మీ కోసం ఒక అదిరిపోయే పజిల్ తీసుకొచ్చాం. ఇక్కడ రెండు ఫోటోలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ లో ఇవి సేమ్ టు సేమ్ అనిపిస్తాయి. కానీ వాటి మధ్య మూడు చిన్న తేడాలు ఉన్నాయి. వాటిని మీరు 15 సెకన్లలో గుర్తించాలి. రెడీనా మరి మీరు.. అయితే కుటుంబంతో సహా పాల్గొని కనిపెట్టండి.

ఇక్కడ ఒక కార్టూన్ సీన్ కనిపిస్తోంది. ఇందులో ఒక యువరాణి తోటలో పూలు కోస్తూ వాటిని తన ఫ్రెండ్ పట్టుకున్న బుట్టలో వేస్తోంది. వెనుక అందమైన కోట, చెట్లు, పూల తోట ఉన్నాయి. మొదటి చూపులో రెండు ఫోటోలు ఒకేలా ఉన్నట్టు అనిపించినా క్లోజ్‌గా చూస్తే మూడు స్పెషల్ డిఫరెన్సెస్ దొరుకుతాయి. వాటినే మీరు పట్టుకోవాలి.
సాధారణంగా ఇలాంటి పజిల్స్ సింపుల్‌గా అనిపిస్తాయి. కానీ ఈ పజిల్‌లో తేడాలు అంత ఈజీగా దొరకవు. చాలా చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫోకస్ పెడితేనే కనిపిస్తాయి. అందుకే ఇది అంత తేలికైన టాస్క్ కాదు.

మీరు 15 సెకన్లలోనే ఈ మూడు డిఫరెన్సెస్ గుర్తిస్తే అది మీలో ఉన్న థింకింగ్ పవర్, ఎనలైజింగ్ స్కిల్స్, ఇంకా రియాక్షన్ టైమ్‌ను చూపిస్తుంది. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్లు స్టడీస్‌లో, కెరీర్‌లో, డెసిషన్స్ తీసుకోవడంలో అందరికంటే ముందుంటారు.
పజిల్ తేడాలను కనిపెట్టడం మీకు కష్టంగా అనిపిస్తే.. ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా మీరు సరైన జవాబును సులభంగా కనుగొనవచ్చు.
- మొదటిది యువరాణి స్నేహితురాలి తలపై ఉన్న తలపాగా మొదటి చిత్రం కంటే రెండవ చిత్రంలో కొంచెం పెద్దగా ఉంటుంది.
- రెండవది, యువరాణి దుస్తులపై ఎడమ చేతి వద్ద ఉన్న పసుపు రంగు అంచు రెండవ చిత్రంలో ఉండదు.
- మూడవది, కుడివైపు కింది మూలలో ఉన్న ఎర్ర పువ్వును జాగ్రత్తగా గమనించండి. మొదటి చిత్రంలో ఆ పువ్వుకు రెండు ఆకులు ఉంటే, రెండవ చిత్రంలో ఒకే ఆకు కనిపిస్తుంది.
- ఈ మూడు తేడాలను మీరు గుర్తించగలిగితే మీరు పజిల్‌ను విజయవంతంగా పరిష్కరించినట్లే.

ఇలాంటివి సాల్వ్ చేస్తూ ఉండటం వల్ల మీ ఐక్యూ షార్ప్‌గా మారుతుంది. ఇంకా కాన్‌సంట్రేషన్ లెవల్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న బ్రెయిన్ గేమ్స్ ట్రై చేయడం మైండ్‌కు మంచి ఎక్సర్‌సైజ్ అవుతుంది.
