Viral Video: వీడియో కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్న యూట్యూబర్.. ఏం జరిగిందో మీరే చూడండి!
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం వద్ద షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో చిత్రకరించేందుకు ఒక యూట్యూబర్ నదిలోకి దిగగా.. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అందరూ చూస్తుండగానే ఆ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యువతలో రోజురోజుకూ సోషల్ మీడియా పెచ్చి పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొందరు ప్రమాధకర రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరి కొందరు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చోటుచేసుకుంది. తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియో చిత్రీకరించాలనుకున్న ఒక యువకుడు డుడుమా జలపాతం వద్ద నీటిలో దిగాడు. అక్కడే గట్టపై ఉన్న అనతి స్నేహిలులు కొందరు.. దాన్ని వీడియో తీస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఆ యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం. ఒడిషాకు చెందిన సాగర్ తుడు అనే ఒక యూట్యూబర్ తన స్నేహితులతో కలిసి కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న ప్రకృతి అందాలు వాళ్లను ఆకర్షించడంతో.. సాగర్ వాటిని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా వీడియో చిత్రీకరించమని స్నేహితులకు చెప్పి సాగర్ నీటిలో దిగాడు. ప్రకృతి అందాలను వీడియో తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఊహించని ప్రమాదం జరిగింది.
అతను నీటిలో ఉండగానే ఒక్కసారిగా జలపాతంలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో బయటకు వద్దామనుకునే లోపే నీటి ప్రవాహం అతన్ని లాక్కెళ్లిపోయింది. ప్రమాదాన్ని గమనించిన అక్కడే స్నేహితులు సాగర్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో అతని స్నేహితులు పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమై పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సాగర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
The video is reportedly from Koraput, where a YouTuber was swept away by strong currents at Duduma Waterfall.
People must exercise extreme caution while filming and never put their lives at risk.
Such a tragic incident. pic.twitter.com/8hHemeWv2e
— Manas Muduli (@manas_muduli) August 24, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
