Watch Video: అయ్యో.. తండ్రిపై ఎటాక్ చేసిన ఎలుగుబంటి.. కాపాడేందుకు వెళ్లిన కొడుకు.. ఆ తర్వాత జరిగిందిదే..
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జునోవా గ్రామంలో ఎలుగుబంటి దాడిలో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు ఎదురుతిరిగి ఎలుగుబంటి పై దాడి చేసినా వాళ్లను ఎలుగుబంటి వదిలిపెట్టలేదు. చేసేది లేక అటవిశాఖ అదికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రపూర్ పారెస్ట్ అధికారులు మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు.

మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా జునోవా గ్రామంలో ఎలుగుబంటి దాడిలో తండ్రి కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు ఎదురుతిరిగి ఎలుగుబంటి పై దాడి చేసినా వాళ్లను ఎలుగుబంటి వదిలిపెట్టలేదు. చేసేది లేక అటవిశాఖ అదికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన చంద్రపూర్ పారెస్ట్ అధికారులు మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. కాగా.. ఎలుగుబంటి దాడిలో తండ్రీకొడుకులు ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా.. ఎలుగుబంటిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు మూడు గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మత్తు మందు ఇచ్చి ఎట్టకేలకు ఎలుగుబంటిని బంధించి చికిత్స కోసం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
అయితే.. అడవిలో ఆకులు కోయడానికి వెళ్ళిన అరుణ్ కుక్సే పై ఎలుగుబంటి ముందు దాడి చేసింది. అయితే.. తండ్రిపై ఎలుగుబంటి దాడిని గమనించిన అరుణ్ కొడుకు అక్కడికి చేరుకున్నాడు.. ఎలుగు బంటి నుండి తండ్రిని కాపాడుకునే ప్రయత్నం చేయగా.. అతనిపైనా కూడా ఎటాక్ చేసింది. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. కాగా.. కొందరు స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా.. కానీ.. ఎలుగు బంటి వారిని వదలలేదు.. ఎలుగుబంటి దాడి దృశ్యాలను స్థానికులు మొబైల్‌లో రికార్డ్ చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




