Noida Dowry Death: నోయిడా హత్యకేసులో కీలక పరిణామం.. నిక్కీ భర్తపై పోలీసుల ఎన్‌కౌంటర్!
నోయిడా నిక్కీ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నిక్కీ విపిన్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు అతడిపై ఎన్‌కౌంటర్ జరిపారు. ఈ కాల్పుల్లో కాల్పుల్లో విపిన్‌కు గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. తమ కూతురిని చిత్రహింసలు పెట్టిన విపిన్‌ను ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిక్కీ తండ్రి డిమాండ్ చేసిన కొద్దిగంటల్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

వరకట్నం వేధింపులతో కొడుకు చూస్తుండగానే భార్యను అతి కిరాతకంగా పెట్రోల్ పోసి భర్త, అత్తింటి వారు హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం వెలుగు చూసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నిక్కీ భర్త విపిన్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, గ్రేటర్ నోయిడా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఇ కాల్పుల్లో విపిన్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే కూలిపోయాడు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరించారు.
అయితే వరకట్నం కోసం తమ కూతురిని ఇంత కిరాతకంగా హత్య చేసిన అత్తింటి వారిని ఎన్‌కౌంటర్ చేసి చంపాలని బాధితురాలి నిక్కీ తండ్రి డిమాండ్ చేసిన కొద్దిగంటల్లోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విపిన్ ఒక పోలీస్ అధికారి నుండి పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నించాడని.. వద్దని పదే పదే హెచ్చరించినప్పటికీ వినకుండా సిర్సా చౌరాహా సమీపంలోకి రాగానే పోలీసుల నుంచి తప్పించుకున్నాడని.. ఈక్రమంలోనే అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
కాల్పుల్లో అతని కాలికి బుల్లెట్ తగిలి గాయపడ్డాడని.. దీంతో విపిన్‌ను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ హత్య విషయంలో ఏమైనా పశ్చాత్తాప పడుతున్నావా అని అడినప్పుడు.. అతను తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని.. తన భార్యను తాను చంపలేదని చెప్పుకొచ్చాడు. నిక్కీ తనంతట తానుగా చనిపోయిందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




