AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతటి దారుణం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని తాళ్లతో కట్టేసిన భార్యాపిల్లలు..

వారి కుమార్తె గోరఖ్‌పూర్‌లో ఎంబీబీఎస్ చదువుతోందని వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత తన EPF నుండి రూ20 లక్షలు అందుకున్నానని, గ్రాట్యుటీ, ఇతర నిధుల నుండి దాదాపు రూ.33 లక్షలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ప్రతిపాల్ స్పష్టం చేశాడు. తన పెద్ద కొడుకుకు రూ.5 లక్షలు, చిన్న కొడుకుకు రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చానని, అయితే తన కుమార్తె వివాహానికి..

ఎంతటి దారుణం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని తాళ్లతో కట్టేసిన భార్యాపిల్లలు..
Retired Dsp Tied Up
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2025 | 8:06 PM

Share

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బు కోసం రిటైర్ట్ డీఎస్పీని సొంత భార్యాపిల్లలే తాళ్లతో కట్టేశారు. శివపురి జిల్లాలోని చందావాని గ్రామంలో రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) భార్య, కుమారులు అతనిపై దారుణంగా దాడి చేశారు. బాధితుడు 62 ఏళ్ల ప్రతిపాల్ సింగ్ యాదవ్‌ను తాడుతో వారు తాళ్లతో కట్టివేసి నేలపై ఈడ్చుకెళ్లారు. అతని సొంత భార్య పిల్లలే ఇంతటి దారుణానికి పాల్పడటం పట్ల స్థానికులు సైతం షాక్‌ అయ్యారు. ప్రతిపాల్‌ సింగ్‌పై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, వారంతా స్థానికులపై కూడా వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మార్చి 31న పదవీ విరమణ చేయడానికి ముందు షియోపూర్ జిల్లాలోని మహిళా సెల్‌లో పనిచేసిన రిటైర్డ్ అధికారిపై అతని భార్య పిల్లలు దాడికి పాల్పడిన వీడియో ఇది. తండ్రిని తాళ్లతో కట్టేసి కొడుకులు ఈడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యం అందరినీ కలచి వేసింది. ఈ సంఘటన ఆగస్టు 20న జరిగింది. వీడియోలో, ఇద్దరు కుమారులు తమ తండ్రిపై దాడికి దిగారు. ఒకరు అత ఛాతీపై కూర్చుని ఉన్నారు. మరొకరు అతని కాళ్ళను లాగుతుండగా, అతని భార్య కూడా కొడుకులకే మద్ధతుగా నిలిచింది. ఇదంతా చూసిన ఇరుగుపొరుగు వారు రిటైర్డ్ అధికారిని విడుదల చేయమని కోరారు.

రిటైర్డ్ డీఎస్పీ ప్రతిపాల్ 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నారు. రిటైర్‌మెంట్ తర్వాత ఆయనకు రూ.20లక్షలు అందాయి. ఈ డబ్బు తమకు కావాలని భార్య, ఇద్దరు కుమారులు ఆయన దగ్గరికి వచ్చి పట్టుబట్టారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తాళ్లతో కట్టేసి ఫోన్, ఏటీఎం కార్డు లాక్కుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత స్థానికులు అతన్ని విడిచిపించారు. కానీ, జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపాల్‌ నిరాకరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వారి భవిష్యత్తు పాడవుతుందని ప్రతిపాల్ పోలీసులను కోరడం కొసమెరుపు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

గత 15 సంవత్సరాలుగా తన భార్య, కుమారుల నుండి విడివిడిగా నివసిస్తున్న ప్రతిపాల్ సింగ్, తన భార్య ఇద్దరు కుమారులతో ఝాన్సీలో నివసిస్తుందని చెప్పారు. వారి కుమార్తె గోరఖ్‌పూర్‌లో ఎంబీబీఎస్ చదువుతోందని వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత తన EPF నుండి రూ20 లక్షలు అందుకున్నానని, గ్రాట్యుటీ, ఇతర నిధుల నుండి దాదాపు రూ.33 లక్షలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ప్రతిపాల్ స్పష్టం చేశాడు. తన పెద్ద కొడుకుకు రూ.5 లక్షలు, చిన్న కొడుకుకు రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చానని, అయితే తన కుమార్తె వివాహానికి కూడా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..