Andhra Pradesh: పోలీసుల్లో వెల్లువిరిసిన మానవత్వం.. సగం కాలిన అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్ఐ

గుర్తు తెలియని ఓ అనాథ శవాన్ని స్వయంగా తన భుజాలపై మోసుకెళ్లారు.. దీంతో మహిళా SIపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఉన్నతాధికారులు.

Andhra Pradesh: పోలీసుల్లో వెల్లువిరిసిన మానవత్వం.. సగం కాలిన అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్ఐ
Lady Si
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 22, 2022 | 7:12 AM

Prakasam District: ఓ లేడీ సబ్ ఇన్స్‌పెక్టర్(Sub-Inspector) మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ లేడీ ఎస్‌ఐ(Lady SI) అందరిచేత శభాష్‌ అనిపించుకున్నారు. గుర్తు తెలియని ఓ అనాథ శవాన్ని స్వయంగా తన భుజాలపై మోసుకెళ్లారు.. దీంతో మహిళా SIపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలం హాజీపురం సమీపంలోని ఫారెస్ట్‌లో ఓ మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. పశువుల కాపరి ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా కాలిపోయి, గుర్తు పట్టలేని విధంగా ఉంది ఆ మృతదేహం.

అయితే డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించడానికి ఆసుపత్రికి తీసుకెళ్లాలి.. కానీ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో మరో వ్యక్తి సాయంతో స్వయంగా శవాన్ని తన భూజాలపై మోసుకెళ్లారు లేడీ SI కృష్ణ పావని. మామూలుగా చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లాలంటే సంకోచించే పరిస్థితి. అలాంటిది సగం కాలిన మృతదేహాన్ని భూజాన మోసిన లేడీ ఎస్‌ఐను స్థానికులతో పాటు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.

మరోవైపు మృతుడి వయసు 65 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఎలా చనిపోయాడు అనేది ప్రాథమికంగా నిర్థారణ కాలేదని పోలీసులు తెలిపారు. అతడు అడవిలోకి ఎలా వచ్చాడు ? లేదా ఎవరైనా తీసుకొచ్చారా ? ఆత్మహత్యా ? హత్యా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఓ మహిళా SI తన భుజాలపై శవాన్ని మోసుకుని పోస్ట్‌మార్టానికి తరలించడంతో ప్రశంసల జల్లు కురుస్తోంది. SI కృష్ణపావనిని ఉన్నతాధికారులు అభినందించారు.

Read Also…. Balakrishna PA Arrest: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ అరెస్ట్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు..!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?