AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambedkar Jayanti: అంబేడ్కర్ జయంతి స్పెషల్‌.. సామాజిక మార్పునకు పునాదివేసిన అమూల్యమైన సూక్తులు మీకోసం

భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌.. న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. అంటరానితనంపై అలుపెరగని పోరు చేశారాయన. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహనీయుడాయన.

Ambedkar Jayanti: అంబేడ్కర్ జయంతి స్పెషల్‌.. సామాజిక మార్పునకు పునాదివేసిన అమూల్యమైన సూక్తులు మీకోసం
Ambedkar Jayanti
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 14, 2023 | 3:15 PM

Share

భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌.. న్యాయవాదిగా, ఆర్థిక వేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. అంటరానితనంపై అలుపెరగని పోరు చేశారాయన. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన మహనీయుడాయన. సమాజంలోని అన్ని వర్గాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉండాలంటూ రాజ్యాంగాన్ని రూపొందించారాయన. అలాంటి మహనీయుడి జయంతి నేడు (ఏప్రిల్‌ 14). ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అంబేడ్కర్‌ చేసిన సేవలను అందరూ స్మరించుకుంటున్నారు. ఇక ఇవాళ దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత విగ్రహాం ఆవిష్కృతం కానుంది. ఈ సందర్భంగా సామాజిక మార్పుకోసం వివిధ సందర్భాల్లో అంబేడ్కర్‌ చెప్పిన అమూల్యమైన సూక్తులు మీకోసం..

  • కులం పునాదుల మీద మీరు ఏమీ సాధించలేరు.. ఒక జాతిని నిర్మించలేరు.. ఒక నీతిని నిర్మించలేరు.
  • స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ.. బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.
  • వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం
  • ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు.. ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం.
  • దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి.
  • జీవించేందుకే మనిషి తినాలి. సమాజ సంక్షేమానికై జీవించాలి.
  • మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ, ఆధారపడవద్దు
  • మితిమీరిన స్వేచ్ఛ సమానాత్వాన్ని హరించివేస్తుంది.
  • మనం ఎంచుకున్న మార్గం వెంట జంకులేకుండా ముందుకు సాగిపోవాలి.
  • విద్య కంటే శీలం గొప్పది
  • ఒక ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండటం, దానిని చేరుకోవడానికై ఓపికగా పరిశ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి.
  • ఒక గొప్ప వ్యక్తికి, ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకై సిద్ధంగా ఉంటాడు.
  • ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు
  • గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు, స్వయంసేవ ఉత్తమమైనది.
  • ఒక వర్గాన్ని ఇంకొక వర్గం పైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం.
  • సామాజిక చింతనకు ధర్మమే ఆధారం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి