AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be Alert: ఉదయాన్నే బ్రెడ్ లాగిస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే అస్సలు వాటి జోలికి వెళ్లరు!

ఎంత సంపాదించినా.. ఎంత బంగారం ఉన్నా.. ఎన్ని బంగళాలు ఉన్నా.. ఎంత మంది మన చుట్టూ ఉన్నా.. ఉండాల్సింది ఆరోగ్యం. అందుకే పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. ఆరోగ్యమే మహాభాగ్యం అని. కరోనా కోరల్లో నుంచి బయటపడిన నాటి నుంచి 90 శాతం మందికి ఆరోగ్యంపై శ్రద్ద

Be Alert: ఉదయాన్నే బ్రెడ్ లాగిస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే అస్సలు వాటి జోలికి వెళ్లరు!
Bread
Nikhil
|

Updated on: Nov 15, 2025 | 5:41 PM

Share

ఎంత సంపాదించినా.. ఎంత బంగారం ఉన్నా.. ఎన్ని బంగళాలు ఉన్నా.. ఎంత మంది మన చుట్టూ ఉన్నా.. ఉండాల్సింది ఆరోగ్యం. అందుకే పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. ఆరోగ్యమే మహాభాగ్యం అని. కరోనా కోరల్లో నుంచి బయటపడిన నాటి నుంచి 90 శాతం మందికి ఆరోగ్యంపై శ్రద్ద పెరిగిందనే చెప్పాలి. కరోనా అంటే ఏంటో తెలియక ముందు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేవాళ్లు కూడా కరోనా తర్వాత ఆహార పరిమితుల్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.

బిజీ లైఫ్‌లో ఉదయం టిఫిన్ అంటే చాలామందికి వైట్ బ్రెడ్​తో శాండ్‌విచ్ లేదా టోస్ట్‌. ఇది తిని బ్రేక్ ఫాస్ట్ త్వరగా పూర్తి చేసేస్తారు. రుచికరంగా ఉన్నా, ఈ తెల్ల బ్రెడ్ ఆరోగ్యానికి పెద్ద శత్రువు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదా (రిఫైండ్ ఫ్లోర్)తో తయారయ్యే వైట్ బ్రెడ్‌లో ఫైబర్ శూన్యం, పోషకాలు దాదాపు ఉండవు.

ఈ బ్రెడ్ తినగానే శరీరంలో చక్కెర స్థాయిలు ఆకాశానికి ఎగిరిపడతాయి. తాత్కాలికంగా శక్తి వచ్చినట్టు అనిపించినా, ఇన్సులిన్ త్వరగా స్పందించి షుగర్ లెవెల్ పడిపోతుంది. ఫలితంగా రెండే గంటల్లో అలసట, ఏకాగ్రత లోపం వచ్చేస్తాయి. రెగ్యులర్‌‌గా తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

వీటిలో ఫైబర్ లేకపోవడంతో జీర్ణవ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. దీంతో మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది. ఉదయం తిన్నా మధ్యాహ్నం లంచ్‌కు ముందుగానే స్నాక్స్ మీద పడతారు. ఇది బరువు పెరగడానికి, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. డయాబెటిస్‌తో పాటు చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ పెరిగి గుండె జబ్బులు, మంట సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.

అంతేకాదు, ఈ బ్రెడ్‌లో ఫైబర్ లేకపోవడంతో మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు మొదలవుతాయి. వ్యాయామం చేయని వారికి ఈ హాని మరింత ఎక్కువ. వైట్ బ్రెడ్‌ను పూర్తిగా మానేయడం కష్టమైతే, బ్రౌన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్‌ తినడానికి మొగ్గు చూపాలి. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలతో కలిపి తింటే మంచిది. రోజూ ఎక్కువ నీరు తాగండి. మన ఆరోగ్యాన్ని మనమే కదా కాపాడుకోవాలి.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.