AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Obesity Day 2022: భారత్‌లో పెరుగుతోన్న ఊబకాయం బాధితులు.. దీనిని ఎలా అదుపులో ఉంచుకోవాలంటే..

World Obesity Day: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఊబకాయం (Obesity) కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 1975 నుండి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది.

World Obesity Day 2022: భారత్‌లో పెరుగుతోన్న ఊబకాయం బాధితులు.. దీనిని ఎలా అదుపులో ఉంచుకోవాలంటే..
Obesity
Basha Shek
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 05, 2022 | 12:48 PM

Share

World Obesity Day: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఊబకాయం (Obesity) కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 1975 నుండి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. దురదృష్టకరమైన విషయమేమిటంటే ప్రపంచంలో ఊబకాయం బాధితుల సంఖ్య పెరుగుతున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. ఇండియన్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రకారం భారతదేశంలోనే సుమారు 135 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. కాబట్టి చాపకింద నీరులా విస్తరిస్తోన్న దీనిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఊబకాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈక్రమంలో వరల్డ్‌ ఒటేసిటీ డే-2022 ను పురస్కరించుకుని ‘ప్రతి ఒక్కరూ చైతన్యమంతమవ్వాలి’ అనే థీమ్‌తో న్యూస్‌ 9 ఫోర్టిస్‌-సి-డాక్‌ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్ , మెటబాలిక్ డిసీజెస్ అండ్ ఎండోక్రినాలజీ చైర్మన్ డాక్టర్ అనూప్ మిశ్రాతో మాట్లాడింది. ప్రస్తుతం ఆయన నేషనల్‌ డయాబెటిస్‌, ఒబేసిటీ, కొలెస్ట్రాల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఊబకాయం నియంత్రణకు సంబంధించిన మనదేశంలో ఎదురవుతోన్న అడ్డంకులు, వాటి పరిష్కారాల గురించి అనూప్‌ మిశ్రా ఏమంటున్నారంటే..

ఆహారంపై నియంత్రణ కోల్పోతున్నారు..! ‘భారతదేశంలో ఊబకాయం నియంత్రణకు ఎన్నో అడ్డంకులు ఎదురువుతున్నాయి. ముఖ్యంగా ప్రతిచోటా ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటికి సంబంధించి వార్తాపత్రికలు, టీవీ ఛానెల్స్‌లలో వచ్చే ప్రకటనలను చూసి చాలామంది ఆహారంపై నియంత్రణ కోల్పోతున్నారు. మరోవైపు ఆహారపు అలవాట్లపై అవగాహన లేకపోవడం, అపోహలు, శారీరక శ్రమ, ఫుడ్‌ లేబుల్స్‌ లేకపోవడం తదితర కారణాలు ఊబకాయం పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక చాలామంది మహిళలు ఇంటి పనుల్లో తలమునకలైపోయి తమ ఆహారం, ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఊబకాయం క్రమంగా మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది. శరీరంలో కొవ్వు ఎంత పెరిగితే, ఇన్సులిన్ చర్యకు అంత అడ్డంకి ఏర్పడుతుంది. ముఖ్యంగా పొత్తికడుపు (కడుపు), కాలేయం, ప్యాంక్రియాస్‌లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇన్సులిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. భారతీయుల్లో కాలేయం, ప్యాంక్రియాస్‌లో కొవ్వు నిల్వలు ఎక్కువగా కనిపిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, లివర్ ఫ్యాట్‌లో చిన్న పెరుగుదల కూడా మధుమేహం వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఊబకాయం లేనివారిలో కూడా కాలేయంలో కొవ్వు పెరగవచ్చు’

బేరియాట్రిక్‌ సర్జరీ వారికే… ఊబకాయం పట్టణాలు, నగరాలతో పాటు గ్రామల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. అందుకే మధుమేహం బాధితుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అయితే కొండ ప్రాంతాల్లో నివాసమున్నవారిలో ఈ సమస్యలు తక్కువగా ఉన్నాయి. ఊబకాయం నియంత్రణ ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. దీనికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. ఉదాహరణకు, బ్రెజిల్‌లో యూనివర్సల్ ఫుడ్ లేబులింగ్ వంటి ప్రణాళికలు ఊబకాయ బాధితులను బాగా తగ్గించేసింది. మనదేశంలో సమస్య ఏమిటంటే ఏ ప్రయత్నాలు కూడా స్థిరంగా ఉండవు. అందుకే ఊబకాయం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనిని అదుపులోకి తీసుకురావాలంటే కనీసం 10 సంవత్సరాల ప్రణాళిక అవసరం. ఇక స్థూలకాయానికి బేరియాట్రిక్‌ సర్జరీ పరిష్కారం కానే కాదు. ఊబకాయం ఉన్న వారిలో కొందరికీ మాత్రమే ఈ సర్జరీ సరిపోతుంది. పైగా ఈ శస్త్రచికిత్సకు బోలెడంత ఖర్చు అవుతుంది. వరల్డ్‌ ఒటేసిటీ డే సందర్భంగా నేనే చెప్పేదేమిటంటే.. ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించడం ఎంతో ముఖ్యం. ఇది కేవలం స్వల్పకాలానికి మాత్రమే కాదు. ఎప్పుడూ పాటించాల్సిందే. బాడీ మాస్ ఇండెక్స్‌18.5-23లోపు, నడుము చుట్టుకొలత 80- 90 సెం.మీ.లోపు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం వల్ల ఊబకాయం, క్యాన్సర్లతో సహా దాదాపు 30 వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు. చిన్నారుల నుండి యుక్త వయస్సు వారిలో ఊబకాయం సమస్యలు కనిపిస్తున్నాయి.తల్లి దండ్రులు చొరవ తీసుకుని తమ పిల్లల్లో ఊబకాయాన్ని, బరువును తగ్గించేందుకు అవసరమైన ఆహార నియమాలు, వ్యాయామాలు కొనసాగించే దిశగా ప్రోత్సహించాలి ‘ అని అనూప్‌ మిశ్రా పేర్కొన్నారు.

Also Read:Sai Dharam Tej: అదిరిపోయే మేకోవర్.. సూపర్ స్టైలిష్ లుక్ లో మెగా మేనల్లుడు.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Priyanka Mohan: పసుపు పంజాబీ డ్రస్‌లో పుత్తడి బొమ్మలా మైమరిపిస్తున్న ప్రియాంక.. ఎట్రాక్ట్ అవుతున్న యూత్…

మీ ఫోన్​లో ఇంటర్నెట్ డేటా అయిపోయిందా..? అయితే నో ప్రాబ్లం.. ఈ ప్యాకేజీ మీకోసమే