మెదడులోని వ్యధలను.. మనసులో బాధలను తగ్గించుకోవాలంటే ఇది తింటే సరిపోతుందట..
ఉరుకుల పరుగుల జీవితం.. కాలాన్ని కాసులతో కొలిచే ప్రపంచం మనది.. ఈ చిన్న జీవితంలో ఎన్ని ఎదో సాధించాలనే కలలు, ఎన్నో బాధ్యతలు.. అనుకోని ఇబందులు..
ఉరుకుల పరుగుల జీవితం.. కాలాన్ని కాసులతో కొలిచే ప్రపంచం మనది.. ఈ చిన్న జీవితంలో ఎన్ని ఎదో సాధించాలనే కలలు, ఎన్నో బాధ్యతలు.. అనుకోని ఇబందులు.. ఇవన్నీ మన మెదడు- మనసు పై మోయలేని భారంగా మారుతుంటాయి. కొంతమంది వాటిని టెక్ఇట్ఈజీ అంటూ సాగిపోతుంటారు. కానీ చాలా మంది వాటిగురించే ఆలోచిస్తూ మైండ్ ను పాడు చేసుకుంటూ ఉంటారు. మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. మనసు ప్రశాంతంగా ఉండేందుకు మరెన్నో ఉపాయాలు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఫుడ్ మాత్రమే తింటే సరిపోదు.. మన మూడ్ కూడా మంచిగా ఉండాలి. మూడ్ మంచిగా ఉంటే టెన్షన్ తగ్గుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోము.. ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. మరి అలాంటి మంచి మూడ్ కావాలంటే చాక్లెట్ తినాల్సిందే అంటున్నారు పరిశోధకులు.
చాక్లెట్లు గుండెకు మంచిదని ఇప్పటికే చాలా పరిశోదలనల్లో తేలిన విషయం తెలిసిందే. తాజాగా పరిశోధకులు చేసిన అధ్యయనంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాకోలెట్‌లో ఉండే పదార్థాలు మన జీర్ణవ్యవస్థలో ఉంటూ మనకు మేలు చేసే సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)పై ప్రభావం చూపుతాయట.దీని వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా మారతామని పరిశోధకులు అంటున్నారు. 85 శాతం డార్క్ చాక్లెట్ మోతాదులతో తక్కువ పాళ్లలో చక్కెర కలిగి ఉన్న 30 గ్రాముల చాక్లెట్‌ను రోజూ మూడు సార్లు చొప్పున తీసుకుంటే మన మూడ్స్ మారిపోతాయట. చెక్లెట్ తినడం వల్ల మంచి మూడ్ తో పాటు మనుషులు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారనీ పరిశోధకులు అంటున్నారు. డార్క్ చాక్లెట్‌లోని ‘కోకో’లో ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్ గుండెజబ్బులు, పక్షవాతం, మతిమరపు, క్యాన్సర్లు, వంటి అనేక సమస్యలను మన దరికి చేరనివ్వవని పలు పరిశోధనల్లో వెల్లడయ్యాయి. సో చాక్లెట్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట..