Seema Chinthakayalu: ఈ కాయలు ఎప్పుడైనా తిన్నారా..? సూపర్ టేస్టే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా బెస్ట్..

సీమ చింతకాయలు.. గ్రామాల్లో చాలామందికి ఈ కాయల గురించి తెలిసే ఉంటుంది. వీటిని పల్లెటూర్లలో గుబ్బ కాయలు లేదా గుబ్బణాలు అని కూడా అంటారు.

Seema Chinthakayalu: ఈ కాయలు ఎప్పుడైనా తిన్నారా..? సూపర్ టేస్టే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా బెస్ట్..
Seema Chintakayalu
Follow us

|

Updated on: Mar 04, 2022 | 5:40 PM

Health Tips: సీమ చింతకాయలు.. గ్రామాల్లో చాలామందికి ఈ కాయల గురించి తెలిసే ఉంటుంది. వీటిని పల్లెటూర్లలో గుబ్బ కాయలు లేదా గుబ్బణాలు అని కూడా అంటారు. మనీలా టామరిండ్, మద్రాస్ టోర్న్, డెవిల్స్ నెక్లస్, జంగిల్ జలేబి అనే పేర్లతో కూడా పిలుస్తారు. సిటీల్లో ఉండేవాళ్లలో చాలామందికి ఈ కాయల గురించి తెలియదు. పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఇవి వగరుగా అనిపిస్తాయి. పండిన తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. కాయలు పంటకు వచ్చినప్పుడు పైన తొక్క విడిపోతుంది. ఈ చెట్లు వేప చెట్లు, తుమ్మ చెట్లు అంత ఎత్తు పెరుగుతాయి. కొమ్మలకు ముళ్లు ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే సీమచింతలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఊర్లు వెళ్తుంటే రోడ్ల పక్కన ఈ చెట్లు కనిపిస్తాయి. మధుమేహ రోగులకు సీమ చింత వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.

  1. ఈ కాయలలో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి.
  2. సీమ చింతకాయల లో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి
  3. సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది
  4. వీటిలో ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల మధుమేహులకు ఉపయోగం ఉంటుంది. డయాబెటిక్ లక్షణాలను తగ్గేలా చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.
  5. సీమచింతకాయల ఆకులలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. ఆ ఆకుల్లోని గుణాలు రొమ్ము క్యాన్సర్ నివారించడంలో, క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా అడ్డుకోవడానికి తోడ్పడతాయి
  6.  గర్భిణీ స్త్రీలకు సీమ చింత మంచి పోషకాలను ఇస్తుంది. నీరసం తగ్గిస్తుంది
  7. ఈ కాయల్లో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది
  8. ఈ కాయలు కాలేయానికి ఎంతో మంచి చేస్తాయి. కాలేయం పనితీరును మెరుగుపరచడంతో పాటూ, హానికరమైన టాక్సిన్లను నిర్మూలిస్తాయి
  9.  యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి సీమ చింతకాయలు. ఈ గుణాలు ప్రేగులోని సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది.

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల  సలహా తీసుకోండి..