AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Failure Symptoms: మీ కిడ్నీలు ఆరోగ్యంగానే ఉన్నాయా? లక్షణాలు బయటపడేనాటికే 90 శాతం పాడైపోయే ప్రమాదం.. ఇలా చేశారంటే..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే కాపాడుకునే బాధ్యత అక్షరాలా మీ చేతుల్లోనే ఉంటుంది. అవును.. మన ఆహార అలవాట్లు, జీవనశైలి ఇవే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం (liver) పెద్ద పాత్ర పోషిస్తే... మూత్రపిండాలు (kidneys) శరీరాన్ని ఫిల్టర్ చేస్తాయి..

Srilakshmi C
|

Updated on: Mar 04, 2022 | 5:22 PM

Share
Natural ways to help keep kidneys healthy: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే కాపాడుకునే బాధ్యత అక్షరాలా మీ చేతుల్లోనే ఉంటుంది. అవును.. మన ఆహార అలవాట్లు, జీవనశైలి ఇవే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం (liver) పెద్ద పాత్ర పోషిస్తే... మూత్రపిండాలు (kidneys) శరీరాన్ని ఫిల్టర్ చేస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కూడా నిర్వహిస్తాయి. మన ఆరోగ్యన్ని కాపాడటంలో ఇంత పెద్ద పాత్ర పోషిస్తున్న అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే ఇవిగో మార్గాలు..

1 / 6
కిడ్నీ వ్యాధులు అంత త్వరగా బయటపడవు. లక్షణాలు బయట పడటకముండే 90 శాతం అప్పటికే కిడ్నీలు చెడిపోయి ఉంటాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది. ఏ  కొద్ది అనుమానం తలెత్తినా వెంటనే కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

2 / 6
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు సరిగ్గా పాటించాలి. మధుమేహం/రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ సోడియం, తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తినడం అలవర్చుకోవాలి.

3 / 6
మూత్రపిండాలు రక్తంలోని హానికర మలినాలను ఫిల్టర్ చేస్తాయి. ఆల్కహాల్, డ్రగ్స్ మొదలైన వాటిని కూడా కిడ్నీలు ఫిల్టర్‌ చేస్తాయి. అందుకే ఎక్కువగా మద్యపానం సేవించేవారికి మూత్రపిండాల వ్యాధులు తలెత్తుతాయి. అంతేకాకుండా చిన్నాచితలక వ్యాధులకు కూడా ట్యామెట్స్‌ అధికంగా వాడకూడదు. సహజ పద్ధతిలో ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలి.

4 / 6
వ్యాయామానికి మించిన మరో ప్రత్యామ్నాయం లేదంటే అతిశయోక్తి కాదేమో. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫలితంగా బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటు అన్ని నార్మల్‌గా ఉంటాయి.

5 / 6
ఒక్కొక్కరికి ఒక్కో విధమైన శరీర లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం ఎక్కువ. ధూమపానం, మద్యపానం  అలవాట్లున్నవారు, గుండె జబ్బులు, ఊబకాయంతో ఉన్నవారికి కూడా కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ.

6 / 6