CM KCR: ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదు.. ఏదైనా ఉంటే చెబుతాం.. రాంచీ‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM KCR: ఇప్పటికైతే ఏ ఫ్రంట్ లేదు.. ఏదైనా ఉంటే చెబుతాం.. రాంచీ‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Cm Kcr

సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో సరైన దిశలో నడవడం లేదన్న కేసీఆర్.. దేశానికి కొత్త అజెండా కావాలన్నారు.

Balaraju Goud

|

Mar 04, 2022 | 6:01 PM


 CM KCR Jharkhand tour: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(BJP) పాలనపై ప్రాంతీయ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వాన్ని సాధించేందుకు అన్ని పార్టీలు ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దేశ వ్యాప్తంగా భావసారూప్యత కలిగిన పార్టీల నేతలతో , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో సరైన దిశలో నడవడం లేదన్న కేసీఆర్.. దేశానికి కొత్త అజెండా కావాలన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌(Hemant Soren)తో పాటు జేఎంఎం పార్టీ అధినేత శిబూ సోరేన్‌ను కలిసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీనియర్ నేత, హేమంత్ సోరెన్ తండ్రి శిబూ సోరెన్ సహకరించారని అన్నారు. పలుమార్లు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. వారితో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు కేసీఆర్ చెప్పారు.

దేశం సరైన దిశలో నడవాలని.. అచ్చే భారత్ కావాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 70 ఏళ్లలో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ కలుస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఏ ఫ్రంట్ లేదని.. ఏదైనా ఉంటే చెబుతామని సీఎం స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ ఆలోచనా విధానం రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తాము ఎవరికీ అనుకూలమో.. వ్యతిరేకమో కాదని ఆయన అన్నారు.

కాగా, గాల్వన్ లోయలో ఉగ్రవాదుల దాడిలో 20 మంది సైనికులతో పాటు, వారికి నేతృత్వం వహించిన మా తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కూడా అసువులు బాసారు. వారి కుటంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సంతోష్ బాబు తో పాటు,నాడు ప్రాణాలు కోల్పయిన సైనికులకు సాయం చేసి, వారి కుటంబాలను సన్మానిస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరు జార్ఖండ్, పంజాబ్ వంటి ఆరేడు రాష్ట్రాల్లో ఉన్నారు. వీరజవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించారు. సీఎం అధికార నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. జార్ఖండ్ పర్యటను ముగించుకున్న సీఎం కేసీఆర్ రాంచీ నుంచి బయలుదేరారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని 2001 లో ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ సమయంలో ప్రథమ ప్రత్యేక అతిథిగా శిబు సోరెన్ గారు హాజరయ్యారు. తెలంగాణ ప్రజల వెన్నంటి నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతీ దశలో వారు మాకు వెన్నంటే ఉన్నారు. వారిని కలిసి, ఆశీర్వాదం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, మంచి అభివృద్ధి సాధిస్తున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఫలవంతమైన చర్చలు జరిగాయి. రాజకీయపరమైన చర్చలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు సాగుతున్నాయని కేసీఆర్ వెల్లడించారు.

75 సంవత్సరాల స్వాత్రంత్యనాంతరం కూడా దేశం అభివృద్ధి చెందాల్సినంతగా జరగలేదు. ప్రపంచంతో పోల్చితే చాలా విషయాల్లో మనం వెనుకబడిపోయామని కేసీఆర్ అన్నారు. పొరుగున ఉన్న చైనా అభివృద్ధి చెందింది. ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వం, దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదు. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడి పై ఉందన్నారు. దీనికి సంబంధించి కూడా చర్చ జరిగిందన్న కేసీఆర్.. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మేమంతా ఒకచోట కలుస్తాం. తర్వాత ఏ ఎజెండాతో ముందుకు పోవాలో, ఎలా ముందుకు పోవాలో, దేశాన్ని మరింత ఉత్సాహంగా, అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలనే ప్రయత్నాలను ఏ విధంగా అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలనే విషయాలను చర్చిస్తాం. దీనికి సంబంధించిన విషయాలను తర్వాత మరింతగా మీకు వివరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్… ఏ ఫ్రంట్ ఇప్పటికీ ఖరారు కాలేదన్న కేసీఆర్. భవిష్యత్తులో దీని పై స్పష్టత వస్తుందన్నారు.

పురోగామి భారత్ ను నిర్మించడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశంలో ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలవడం జరుగుతున్నదని కేసీఆర్ తెలిపారు. ఏ విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించలేం. ఒకరిద్దరితో ఇది అయ్యే పని కాదు. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక దారి దొరకుతుంది. ఏ దారిలో వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలా లేదా మరోటి ఏర్పాటు చేయాలా అనే విషయాలను మీకు మున్ముందు తెలియజేస్తామని కేసీఆర్ అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu