Bank Jobs 2022: నెలకు 89 వేల జీతంతో.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 105 స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన..
Bank Of Baroda Specialist Officers Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో పనిచేసేందుకు స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల (Specialist Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 105
విభాగాలవారీగా ఖాళీలు:
- ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్ – డిజిటల్ ఫ్రాడ్ పోస్టులు: 15
- ఎమ్ఎస్‌ఎమ్‌ఈ డిపార్ట్‌మెంట్‌లో క్రెడిట్ ఆఫీసర్: 40
- ఎమ్ఎస్‌ఎమ్‌ఈ డిపార్ట్‌మెంట్‌లో క్రెడిట్ ఆఫీసర్ – ఎక్స్‌పోర్ట్/ఇంపోర్ట్ బిజినెస్: 20
- కార్పొరేట్ క్రెడిట్ డిపార్ట్‌మెంట్‌లో ఫోరెక్స్ (ఆక్యుసిషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్): 30
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.69,180ల నుంచి రూ.89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్/డిప్లొమా, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకియాట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 600 ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 100
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 24, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: