మీ ఫోన్​లో ఇంటర్నెట్ డేటా అయిపోయిందా..? అయితే నో ప్రాబ్లం.. ఈ ప్యాకేజీ మీకోసమే

మీ ఫోన్​లో ఇంటర్నెట్ డేటా అయిపోయిందా..? అయితే నో ప్రాబ్లం.. ఈ ప్యాకేజీ మీకోసమే
Data Loan

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ కనిపిస్తోంది. సెల్ ఫోన్ వాడాలంటే డేటా ప్యాక్(Data pack) వేయించుకోవడం కచ్చితంగా మారింది. డేటా లేకుంటే సెల్ ఫోన్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని..

Ganesh Mudavath

|

Mar 04, 2022 | 7:16 PM

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ కనిపిస్తోంది. సెల్ ఫోన్ వాడాలంటే డేటా ప్యాక్(Data pack) వేయించుకోవడం కచ్చితంగా మారింది. డేటా లేకుంటే సెల్ ఫోన్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టెలికాం సంస్థలు వాయిస్ కాల్స్ తో పాటు రోజూ వారీ డేటా ను ఇస్తున్నాయి. వీటి ద్వారా డెయిలీ డేటా లిమిట్ ను మనం ఉపయోగిస్తున్నాం. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో డెయిలీ డేటా లిమిట్ అయిపోయాక.. ఇంటర్నెట్ వేగం(Internet) తగ్గిపోతుంది. ఒక్కోసారి అర్జంట్ పని ఉన్నప్పుడూ ఇలా సడన్ గా డేటా ఆయిపోయినప్పుడు మనకు విసుగు, చిరాకు కలుగుతుంది. ఇంకా కొంచెం డేటా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇలాంటి వారి ఇబ్బందులను తొలగించేందుకు టెలికాం సంస్థలు కొన్ని అద్భుత ఆఫర్లు తీసుకొచ్చాయి. తమ వినియోగదారుల సౌలభ్యం కోసం డేటా లోన్ ప్యాకేజీని(Loan Package) అందుబాటులోకి తీసుకొచ్చాయి. టాప్-అప్ వేయించుకునే సౌకర్యం అందుబాటులో లేనివారి కోసం ఇది ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించాయి. డబ్బు లేకున్నా.. ముందు రీఛార్జ్ చేయించుకుని, తర్వాత తిరిగి చెల్లించేలా సరికొత్త ఆఫర్ ను వినియోగదారుల కోసం తీసుకువచ్చాయి.

జియోలో ఇలా..

జియో గతేడాదే ఈ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఎమర్జెన్సీ డేటా లోన్​’ పేరిట రీఛార్జ్​చేసుకుని, తర్వాత డబ్బు చెల్లించే వెసులుబాటు కల్పించింది. జియో వాడేవారు గరిష్ఠంగా రూ. 25కు 2జీబీ డేటాను లోన్​గా తీసుకోవచ్చు. ఇలా ముందే రీఛార్జ్ చేసుకున్న తర్వాత.. లోన్​ను తిరిగి చెల్లించడానికి మై జియో యాప్​ను ఓపెన్​ చేసి ప్రొసీడ్​ బటన్ క్లిక్ చేయాలి. ‘ఎమర్జెన్సీ డేటా ఓచర్స్’ లోకి వెళ్తే అక్కడ పేమెంట్ ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి నగదు చెల్లించాలి. డేటా లోన్​ను తిరిగి చెల్లించకుంటే ఇలాంటి ఆఫర్ ను మళ్లీ పొందకుండా సంస్థ నిషేధిస్తుంది. లోన్ మొత్తం చెల్లించాకే డేటా లోన్​ఆఫర్​లకు అనుమతినిస్తుంది.

ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా..

ఎయిర్ టెల్ కూడా తన వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తుంది. రూ. 27కు 80ఎంబీ వరకు ఎమర్జెన్సీ డేటాను వాడుకునే సదుపాయం కల్పించింది. ఈ డేటా ప్యాక్ కు 2 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.*141*567కు డయల్ చేయడం ద్వారా ఈ డేటా ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. వొడాఫోన్ ఐడియా కూడా తమ కస్టమర్లకు ఇంటర్నెట్ లోన్ సౌకర్యం అందిస్తోంది. కొన్ని షరతులు వర్తించే కస్టమర్లు మాత్రమే ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఐడియా కస్టమర్​గా మారి 90రోజలు పూర్తయితేనే ఈ లోన్ తీసుకునేందుకు అర్హులు. లోన్ తీసుకునే సమయంలో ఉన్న ధర కంటే చెల్లించే సమయంలో ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. *150*06#కు డయల్ చేయడం ద్వారా రూ. 6కు 25ఎంబీ 2జీ డేటా వస్తుంది.*150*333#కు డయల్ చేస్తే రూ. 11కు 35ఎంబీ 3జీ డేటా లోన్ యాక్టివేట్​అవుతుంది.

Also Read

NIO Vizag Jobs 2022: ఆన్‌లైన్ ఇంటర్వ్యూతోనే.. విశాఖపట్నంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు!

Seema Chinthakayalu: ఈ కాయలు ఎప్పుడైనా తిన్నారా..? సూపర్ టేస్టే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా బెస్ట్..

Ram Gopal Varma: ఆయన పీఎం అవుతాడట.. ఈయనను సీఎం చేస్తాడట.. కేఏ పాల్ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu