AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: ఆయన పీఎం అవుతాడట.. ఈయనను సీఎం చేస్తాడట.. కేఏ పాల్ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ..

టాలీవుడ్ సంచలన దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యారో వివాదాలతో అంతకు డబుల్ ఫెమస్ అయ్యారు.

Ram Gopal Varma: ఆయన పీఎం అవుతాడట.. ఈయనను సీఎం చేస్తాడట.. కేఏ పాల్ వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ..
Rgv, Ka Paul
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2022 | 4:04 PM

Share

Ram Gopal Varma: టాలీవుడ్ సంచలన దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన సినిమాలతో ఎంత ఫేమస్ అయ్యారో వివాదాలతో అంతకు డబుల్ ఫెమస్ అయ్యారు. నిత్యం తనని తాను వార్తల్లో ఉండేలా చూసుకోవడం వర్మకు మాత్రమే చెల్లుతుంది. సందర్భం ఏదైనా మధ్యలో దూరడం వర్మ స్టైల్‌. ఇదే కొన్ని సార్లు కాంట్రవర్సీలకు దారి తీస్తుంటుంది. ఆయనకు కావాల్సిన.. ఫలితం దక్కుతుంది. వర్మ ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో.. ఏ విషయంపై ఎలా స్పందిస్తాడో ఊహించడం కష్టమే. తనకు నచ్చింది చేయడం.. మనసులోని మాటలను మొహమాటం లేకుండా బయటపెట్టడం ఆర్జీవి స్టైల్. వర్మ చేసే పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేయడం ఆయన నైజం.. ట్వీట్లతో రచ్చ చేయడం.. ఆయనకున్న గొప్పతనం.. ఏదేని ఒక బర్నింగ్ టాపిక్‌ను వ్యగ్యంగా చెప్పడం.. అవసరమైతే మరో లెవల్లో ఇష్యూ అయ్యేలా చేయడం అర్జీవికే సాధ్యమైన తుంటరి తనం. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ ట్వీట్ చేశారు ఆర్జీవీ.

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ అందరికి గుర్తుండే ఉంటారు. ఆమధ్య ఏపీ ఎన్నికల సమయంలో సొంతంగా పార్టీ పెట్టి అందరిని చిత్తూ చిత్తు గా ఓడిస్తాని చివరికి తానే ఓడి చాలా రోజులు కనిపించకుండా పోయారు పాల్. తాజాగా ఆయన కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో మిస్టర్ పాల్ తాను పెట్టిన ప్రజా శాంతి పార్టీలో పవన్ చేరితే.. ఆయన ప్రధాని అయిన వెంటనే పవన్ ను ఏపీకి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈవీడియోను ఆర్జీవీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ సార్ మన దేశానికి కాబోయే ప్రధాని మాటలు వినండి అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు ఆర్జీవీ. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kriti Sanon: చీర కట్టు అందాలతో కేక పెట్టిస్తోన్న కృతి సనన్ లేటెస్ట్ ఫోటోస్

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..