Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..
Radheshyam

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం రాధేశ్యామ్‌ (Radheshyam). జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో సీనియర్‌ నటులు కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ (Bhagyashree) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Basha Shek

|

Mar 04, 2022 | 2:54 PM

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం రాధేశ్యామ్‌ (Radheshyam). జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రేమకథా చిత్రంలో సీనియర్‌ నటులు కృష్ణంరాజు, అలనాటి అందాల తార భాగ్యశ్రీ (Bhagyashree) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ లో తలమునకలయ్యారు దర్శక నిర్మాతలు. ఇటీవలే ముంబైలో ఈ సినిమా రిలీజ్‌ ట్రైలర్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో నిమిషం నిడివి గల ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ప్రేమకు, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణే అంటూ మరింత ఆసక్తిని పెంచేసింది. తాజాగా రాధేశ్యామ్‌ సెన్సార్ (Censor) కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సినిమా రన్‌ టైమ్‌ను 2 గంటల 18 నిమిషాలు లాక్ చేశారని తెలుస్తోంది.

కాగా టీ సిరీస్ – యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన రాధేశ్యామ్‌ చిత్రాన్ని మొత్తం 5 భాషలలో రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో పెద్ద ఎత్తున థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా సినిమాకు తెలుగులో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్, తమిళంలో సత్యరాజ్, హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక సంగీతం విషయానికొస్తే.. వివిధ భాషలకు తగ్గట్లుగా జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి బాణీలు, పాటలు సమకూర్చారు. మరి ఇన్ని విశేషాలున్న రాధేశ్యామ్ చిత్రం సిల్వర్‌ స్ర్కీన్‌పై ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ..

Also Read:Viral Video: వామ్మో.. వీడి ధైర్యానికి సలాం కొట్టాల్సిందే.. భారీ పైథాన్‌లతో గేమ్స్ ఆడేస్తున్నాడు.. వైరల్ వీడియో

Khammam: భర్త మోసం చేశాడని భార్య వినూత్న నిరసన..న్యాయం కోసం వాటర్‌ట్యాంక్‌ ఎక్కిన యువతి

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. రష్యా కీలక నిర్ణయం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu