Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..

Aadavallu Meeku Joharlu Movie Review : చెప్పాలనుకున్న విషయాన్ని టైటిల్‌లోనూ, కథలో ఉన్న కంటెంట్‌ని ట్రైలర్‌లోనూ చూపించి... సినిమాకు ఆహ్వానించడం ఒక పద్ధతి.

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'..
Aadavallu Meeku Joharlu
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2022 | 5:35 PM

చెప్పాలనుకున్న విషయాన్ని టైటిల్‌లోనూ, కథలో ఉన్న కంటెంట్‌ని ట్రైలర్‌లోనూ చూపించి… సినిమాకు ఆహ్వానించడం ఒక పద్ధతి. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విషయంలో డైరక్టర్‌ కిశోర్‌ తిరుమల పాటించింది అదే.

సినిమా: ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu)

నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌

నటీనటులు: శర్వానంద్‌, రష్మిక మందన్న, ఖుష్బూ, రాధిక, ఊర్వశి, రాజశ్రీ నాయర్‌, సత్యకృష్ణన్‌, కల్యాణి నటరాజన్‌, ఝాన్సీ, రజిత, ప్రదీప్‌ రావత్‌, సత్య, వెన్నెలకిశోర్‌ తదితరులు

కెమెరా: సుజిత్‌ సారంగ్‌

ఎడిటింగ్‌: ఎ. శ్రీకర్‌ ప్రసాద్‌

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

రచన- దర్శకత్వం: కిశోర్‌ తిరుమల

నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి

విడుదల: మార్చి4, 2022

చిరంజీవి అలియాస్‌ చిరు (శర్వానంద్‌)ది పెద్ద ఫ్యామిలీ. తన తల్లి (రాధిక)తో పాటు, ఆమె తోబుట్టువులు నలుగురు (ఊర్వశి, కల్యాణీ నటరాజన్‌, రాజశ్రీ నాయర్‌, సత్య కృష్ణన్‌) చిరుని గారాబంగా పెంచుతారు. చిరంజీవికి మంచి అమ్మాయిని చూడాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి సంబంధానికీ వంక పెడతారు. దాంతో చిరుకి చిరాకు వస్తుంది. అనుకోకుండా అతనికి ఆద్య (రష్మిక) పరిచయమవుతుంది. ఆమె మీద ప్రేమను పెంచుకుంటాడు. ఇంట్లో వాళ్లతోనూ అదే విషయం చెబుతాడు. చిరు అంటే ఆద్యకి సదభిప్రాయం ఉన్నప్పటికీ, తన తల్లి (ఖుష్బూ)… తనకు పెళ్లి చేసే ఆలోచనలో లేదని గట్టిగా చెబుతుంది. దానికి రీజన్‌ ఏంటి? ఆద్య తల్లి వకుళతో కలిసి పనిచేసే సరిత విషయంలో ఏం జరిగింది? పెళ్లి అంటే వాళ్ల ఫ్యామిలీకి పడదా? ఇంతమందిని ఒప్పించి చిరు, ఆద్య పెళ్లి చేసుకున్నారా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

టైటిల్‌కి తగ్గట్టుగానే ఉంది సినిమా. ఇంటి నిండా ఆడవాళ్లు, వాళ్లందరికీ నచ్చితేగానీ ఏ పనీ చేయని హీరో… ఇలా సాగుతుంది ఆడవాళ్లు మీకు జోహార్లు. అంత మంది ఆడవాళ్ల మధ్య నలిగిపోయే కుర్రాడిలా శర్వానంద్‌ నటన బావుంది. తనకు ప్రపంచంలో తల్లి తప్ప ఇంకేదీ ముఖ్యం కాదనుకునే అమ్మాయిగా రష్మిక నటన బావుంది. రాధిక, ఖుష్బూ, ఊర్వశి, సత్యకృష్ణన్‌ ఎవరి పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు.

వెన్నెలకిశోర్‌ కామెడీ, ఊర్వశి స్టీల్‌ డబ్బా కామెడీ, బ్రహ్మానందం రైల్వే స్టేషన్‌ పెళ్లిచూపులు నవ్వించాయి. దేవిశ్రీ పాటలు, నేపథ్య సంగీతం బావుంది. అబ్బాయిలో అమ్మాయిలు చూసే ముఖ్యమైన మూడు విషయాల గురించి రాధిక చెప్పిన మాటలు అర్థవంతంగా ఉన్నాయి.

అందరికీ తెలిసిన కథ, అనూహ్యమైన ట్విస్టులు లేకపోవడంతో కథ సాదాసీదాగా సాగినట్టు అనిపించింది. వకుళ, సరిత స్ట్రిక్ట్ గా మారడానికి గల కారణాన్ని ఇంకాస్త ఎలాబరేట్‌గా చెప్పి ఉంటే బావుండేది. భావోద్వేగాలను ఇంకాస్త బలంగా పలికించాల్సింది. అక్కడక్కడా… సన్నివేశాలుగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.

Also Read: Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువే..

Sreeleela: మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం కష్టం.. వైరలవుతున్న యంగ్ హీరోయిన్ పోస్ట్..

Rana Daggubati: రానాకు క్లాస్ పీకిన హీరో సూర్య.. స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చిన భళ్లాల దేవ..

Viral Video: ద్యావుడా.. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాల్సిందే.. పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్..