AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: రానాకు క్లాస్ పీకిన హీరో సూర్య.. స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చిన భళ్లాల దేవ..

తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల జైభీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా

Rana Daggubati: రానాకు క్లాస్ పీకిన హీరో సూర్య.. స్టేజ్ పైనే క్లారిటీ ఇచ్చిన భళ్లాల దేవ..
Rana
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2022 | 10:01 AM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇటీవల జైభీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..నటనపరంగానూ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఈటీ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గురువారం ఈటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడకకు రానా దగ్గుబాటి (Rana Daggubati), సత్యరాజ్, చిత్ర దర్శకుడు పాండిరాజ్ తదితరులు పాల్గోన్నారు. ఈ క్రమంలో రానా మాట్లాడుతూ.. సూర్యతో జరిగిన ఓ ఆసక్తిక ఘటనను షేర్ చేసుకున్నారు.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. నేను సూర్యగారికి పితా మగన్ సినిమా నుంచి పెద్ద అభిమానిని. అప్పుడు ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత నా సినిమాను ఎడిటింగ్ రూంలో ఆయన చూశారు. తర్వాత నన్ను కారులో ఎక్కించుకుని.. నాలుగు గంటలపాటు హైదరాబాద్ లోని రోడ్లపై తిప్పుతూ బాబు నువ్వు చేసేది యాక్టింగ్ కాదు.. ఏదో తట్టి మేనేజ్ చేసేస్తున్నావ్ అంటూ నాలుగు గంటలు క్లాస్ పీకారు. అలా అరోజు ఆయన నాకు క్లాస్ కారణంగానే నేను ముందుకు భళ్లాలదేవుడిగా, డానియల్ శేఖర్ గా నిలబడిగలిగాను.. అంటూ చెప్పుకొచ్చారు. అయితే రానా ఈ విషయాన్ని చెబుతున్న సమయంలో సూర్య వద్దని వారించాడు. కానీ రానా సూర్య మాటలు పట్టించుకోకుండా.. మొత్తం విషయాన్ని చెప్పేశారు.

Also Read: Suriya: కంఫర్ట్ జోన్‏లో ఉంటే ఎదుగుదలకు ఫుల్‏స్టాప్ పడ్డట్లే.. హీరో సూర్య షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Non Stop: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూరెడ్డి.. ఎవరు సపోర్ట్ చేయలేదంటూ..

Aadavallu Meeku Joharlu Twitter Review: ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్.. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఎలా ఉందంటే..

Director Thirumala Kishore: మహిళలు క్లాప్స్ కొట్టేలా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వుంటుంది.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కామెంట్స్ వైరల్..