AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: కంఫర్ట్ జోన్‏లో ఉంటే ఎదుగుదలకు ఫుల్‏స్టాప్ పడ్డట్లే.. హీరో సూర్య షాకింగ్ కామెంట్స్..

తమిళ్ స్టార్ హీరో సూర్యకు (Suriya) ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిన విషయమే. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ

Suriya: కంఫర్ట్ జోన్‏లో ఉంటే ఎదుగుదలకు ఫుల్‏స్టాప్ పడ్డట్లే.. హీరో సూర్య షాకింగ్ కామెంట్స్..
Suriya
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2022 | 8:36 AM

Share

తమిళ్ స్టార్ హీరో సూర్యకు (Suriya) ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిన విషయమే. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఈ హీరోకు యమా క్రేజ్ ఉంది. ఇప్పటివరకు సూర్య నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇటు తెలుగులోనూ హీరో సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటీవల జైభీమ్ (Jai Bhim) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య.. సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఈటీ (ET) సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీ పై అంచనాలను పెంచేశాయి. ఇందులో సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‏గా నటిస్తోంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 10న విడుదల కానుంది. ఈ క్రమంలో గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. సూర్య మాట్లాడుతూ.. కంఫర్ట్ జోన్‏లో ఉంటే ఎదుగుదల ఉండదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

హీరో సూర్య మాట్లాడుతూ.. నేను ఆగరం ఫౌండేషన్ స్థాపించాను. ఈరోజు నేను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అందరు మాట్లాడుతున్నారు.. కానీ ఈ సంస్థను ప్రారంభించడానికి ఇన్‏స్పిరేషన్ ఇచ్చింది మాత్రం చిరంజీవిగారే. రక్తదానానికి సంబంధించిన కొన్ని లక్షల మందిలో ఆయన మార్పు తీసుకొచ్చారు. అందులో కొంతైనా నేను చేయాలనుకున్నాను.. అందుకే ఆగరం ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. మా సంస్థ నుంచి 5 వేల మంది తొలితరం పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు. కంఫర్ట్ జోన్‏లో ఉండకూడదు.. మనిషి అలా అనుకుంటే.. ఎదుగుదల ఉండదు. ఆ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మార్పు ఉంటుంది. మన మనసు ఏం చెబితే అది వినాలి..అందుకోసం కష్టపడాలి. కరోనా సమయంలోనూ అందరూ తమ చుట్టూ ఉన్నవారికి సహాయపడ్డారు. అలాగే ముందుకు వెళ్దాం అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Samantha: సమంతకు దూకుడెక్కువ.. షాకింగ్ విషయాలను చెప్పిన ట్రైనర్ జునైద్..

Srivalli Song: శ్రీవల్లీ సాంగ్ బెంగాలీ వెర్షన్ విన్నారా ?.. అదిరిపోయిందిగా..

Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..

Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి