Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి

Bhagya shree : ప్రభాస్ వాటిని బాగా మెయింటేన్ చేస్తాడు.. ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన బాలీవుడ్ నటి
Bhagyashree

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నడిచిన రాధేశ్యామ్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Rajeev Rayala

|

Mar 03, 2022 | 5:11 PM

Bhagya shree : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నడిచిన రాధేశ్యామ్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. విధికి ప్రేమకు మధ్య జరిగే పోరులో ఎవరు విజయం సాధించారు అనేది ఈ సినిమా కథాంశం. ఈ మూవీలో ప్రభాస్ హస్తసాముద్రిక నైపుణ్యుడిగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.. ఈ మూవీలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాగ్యా శ్రీ మాట్లాడుతూ.. చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. డైరెక్టర్ రాధాకృష్ణ మీకు ఇక్కడ అభిమానులు ఉన్నారు అని చెప్పారు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ప్రభాస్ అందరికీ డార్లింగ్.. నాకు కూడా ఇప్పుడు డార్లింగ్ అయ్యారు. చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అని ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు భాగ్య శ్రీ. ఇక ఈ మూవీలో నేను ఒక యంగ్ మథర్ ని.. తలైవి – రాధే శ్యామ్ అవకాశాలు ఒకే టైం లో వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఈ ఫిల్మ్ ఇంత డిలే అయ్యింది. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా అని అన్నారు ఆమె.

నా రోల్ సినిమాలో ప్రభాస్ అమ్మ.. సినిమాలో నేను ఒక డాన్సర్ గా కూడా కనిపిస్తా.. నాకు డాన్స్ అంతగా రాదు.. భరత నాట్యం, కూచిపూడి లాంటివి మన ట్రెడిషన్.. చాలా ఏళ్ళ తరబడి నేర్చుకుంటారు అందరూ.. బట్ నాకు అంత సమయం లేదు.. కేవలం 5 రోజులలో నేర్చుకోవలసి వచ్చింది.. ఎలాంటి తప్పు జరగకూడదు అని కోరుకున్నా అన్నారు. అలాగే ప్రభాస్ వల్ల మాకు చాలా రుచికరమైన ఫుడ్ సెట్స్ వచ్చేది. నాకు మిర్చి, బాహుబలి నుండి ప్రభాస్ తెలుసు. ప్రభాస్ రిలేషన్స్ ని బాగా మైంటైన్ చేస్తారు. ఇక నా ఈ 32 ఏళ్ల కెరీర్ ను చాలా చిన్నది అనే నేను అనుకుంటా. ఫుడ్ బాగా తింటా.. నీళ్లు బాగా తాగుతా.. ఇప్పటి జనరేషన్ అంతా స్లిమ్ గా అవ్వాలని చూస్తున్నారు.. మెడిసిన్  ఉపయోగిస్తున్నారు.. దేవుడు మనకు ఇచ్చిన నేచురల్ బ్యూటీని సరిగ్గా ఉంచుకోవాలి. నా భర్తకు తన భార్య ప్రపంచంలోనే పెద్ద అందగత్తె అని ఫీలింగ్.. నన్ను తన ఇంట్లోనే దాచుకోవాలి అని అనుకుంటాడు.. నాకు తెలుగు సినిమాలు ఇంకా చేయాలని ఉంది.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఇప్పుడు అన్ని ప్రదేశాల్లో చాలా ఆదరణ లభిస్తోంది.. నాకు మథర్ రోల్ చాలా ఇష్టం.. ఎందుకంటే నేను కూడా ఒక మదర్ నే..ఇక పూజాతో నాకు ఎక్కువ సీన్స్ లేవు.. కానీ, తను చాలా స్వీట్. తెలుగు కూడా బాగా మాట్లాడుతుంది అని చెప్పుకొచ్చారు భాగ్య శ్రీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu