Taapsee Pannu : పెళ్లికి వేళాయరా.. చేప కళ్ల చిన్నది తాప్సీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ .?

తెలుగు తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో అందాల భామ తాప్సీ ఒకరు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర  రావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది..

Taapsee Pannu : పెళ్లికి వేళాయరా.. చేప కళ్ల చిన్నది తాప్సీ మ్యారేజ్ డేట్ ఫిక్స్ .?
Taapsee
Follow us

|

Updated on: Mar 03, 2022 | 5:55 PM

Taapsee Pannu : తెలుగు తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న భామల్లో అందాల భామ తాప్సీ ఒకరు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. మొదటి సినిమాతోనే అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. తెలుగులో రాణిస్తున్న సమయంలోనే ఈ అమ్మడికి తమిళ్ లోనూ మంచి ఆఫర్స్ వచ్చాయి. తెలుగు తమిళ్ లో బిజీగా హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ సరసన చేరిపోయింది ఈ బ్యూటీ. అయితే బాలీవుడ్ లో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రాధాన్యత ఇస్తూ రాణిస్తుంది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యూక్ ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ మస్తు బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందని వార్తలు ఎప్పటినుంచో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.  బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో తాప్సీ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆమె సోదరి షగున్ పన్ను ద్వారా మాథియాస్ బో తాప్సీకి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. వీరి ప్రేమను పెద్దలు కూడా ఆంగీకరించారు. అయితే తాజాగా మరోసారి ఈ అమ్మడి పెళ్లి టాపిక్ బీ టౌన్ లో చక్కర్లు కొడుతుంది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని తాప్సీ నిర్ణయించుకున్నారట. దీంతో కుటుంబసభ్యులు వీరి వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఈ చిన్నది లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది. అదే  `మిషన్ ఇంపాజిబుల్`. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..