Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..

రాజావారు రాణివారు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). మొదటి సినిమాతోనే మంచి టాక్ సంపాదించుకున్న ఈ హీరో..

Kiran Abbavaram: టికెట్టు కొని సినిమా చూసే నన్ను హీరోను చేశాడు.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్..
Kiran Abbavaram
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 03, 2022 | 4:33 PM

రాజావారు రాణివారు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). మొదటి సినిమాతోనే మంచి టాక్ సంపాదించుకున్న ఈ హీరో.. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సెబాస్టియన్ పీసీ 524 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేచీకటి కాన్సెప్ట్‏తో ఈ చిత్రాన్ని ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్‌ పతాకంపై బి . సిద్దారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు, ట్రైలర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.నువేక్ష (నమ్రతా దారేకర్) , కోమలి ప్రసాద్, హీరోయిన్లు గా నటిస్తున్న “సెబాస్టియన్‌ పిసి524’. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న థియేటర్స్‌లలో ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్, చెర్రీ, సీనియర్ నటుడు సాయి కుమార్, హీరోలు అడవి శేష్ ,ఆకాష్ పూరి,సప్తగిరి నిర్మాత కోడి దివ్య,లిరిక్స్ రైటర్ భాస్కర పట్ల తదితరులు చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం భావోద్వేగ కామెంట్స్ చేశారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..ఎంతోమంది పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి వచ్చారు వారందరికీ నా ధన్యవాదాలు.నాకు ఇండస్ట్రీలో ఒక అవకాశం విలువ ఏంటో తెలుసు.ఆ అవకాశం కెమెరా ముందు నిల్చోవడమే అదృష్టంగా.. అదొక వరంగా భావిస్తున్నాను. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే వారిని ఎంతో బాగా చూసుకుంటాం.అలాంటింది మన కోసం థియేటర్స్ కు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వినిమా చూసే ప్రేక్షకులను నిరాశ పరచకూడదని చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తియ్యడం జరిగింది.ఈ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా నిద్రలేకుండా పని చేశారు. ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి సినిమా చేశారని మెచ్చుకుంటారు. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. తల్లి కొడుకు దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటది నాన్నా నీకు రేచీకటి నా బిడ్డకు రేచీకటి అనే విషయం ప్రపంచానికి తెలిస్తే జాలిగా చూస్తారు. నీకు రేచీకటి ఉన్న విషయం ప్రపంచానికి తెలియకూడదు అలా అని చెప్పి నువ్వు పోలీస్ జాబ్ చెయ్యేలనేది మీ నాన్న కల నా..కల ఎన్నో షాక్రిఫైస్ చేసి ఈ పోలీస్ జాబ్ ఇప్పించాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోలీస్ జాబ్ ను మిస్ చేయద్దు అని ప్రామిస్ తీసుకుని వాడి లైఫ్ ఎలా సర్వైవ్ అయ్యింది. తను ఎలా కష్టపడ్డాడు తనకు ఎలాంటి కష్టం వచ్చింది. దాన్ని ఎలా ఓవర్ కం ఆయ్యడు అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.  అతి తక్కువ సమయంలోనే నాకు జిబ్రాన్ వంటి సంగీత దర్శకుడు నా సినిమాకు పనిచేస్తారు అనుకోలేదు. తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నాకు సినిమా అంటే ఇష్టం. ప్రాణం దానిని గురించాడు మా అన్న. ఎక్కడో ఊర్లో టికెట్ కొనుకొని సినిమా చూసే నన్ను ఈ రోజు హీరోను చేశాడు అని భావోద్వేగాయానికి లోనైయ్యాడు. తను ఈ రోజు మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది. తను కోరుకున్న విధంగానే నేను ఇంకా ఎక్కువగా కష్టపడి మంచి సినిమాలు చేస్తూ నీకు మంచిపేరు తీసుకువస్తాను.  మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా “సెబాస్టియన్‌ పిసి524’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్ తో బయటికి వస్తారు అన్నారు.

Also Read: Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..

Siddhu Jonnalagadda: కుర్ర హీరోకు క్యూ కడుతున్న ఆఫర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌తో డీజే టిల్లు..?

Diet For Jaundice: పచ్చ కామెర్లు ఉన్నవారు తినాల్సిన ఆహారపు పదార్థాలు.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్..

Deepika Pilli: క్యూట్ లుక్స్ తో దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్