AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..

తమిళ్ స్టార్ హీరో అజిత్‏కు (Ajith) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న అజిత్ ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తుంటాడు.

Ajith: వలిమై తర్వాత స్టైల్ మార్చిన అజిత్.. న్యూలుక్ అదుర్స్ అంటోన్న ఫ్యాన్స్..
Ajith Valimai
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2022 | 5:39 PM

Share

తమిళ్ స్టార్ హీరో అజిత్‏కు (Ajith) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న అజిత్ ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తుంటాడు. అంతేకాదు.. తాను చేయబోయే సినిమా కోసం పూర్తిగా మేకప్.. హెయిర్ కలరింగ్ వేయకుండానే న్యాచురల్‏గా చేస్తుంటాడు. స్టార్ హీరో అయినప్పటికీ.. అజిత్ లైఫ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బైక్ రైడ్స్ ఎంతో ఇష్టపడే అజిత్.. ఇప్పటికే వేల కిలోమీటర్లు బైక్స్ పై ప్రయాణించాడు. అజిత్ స్టైల్.. లుక్‏కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ హీరో వలిమై హిట్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులో కూడా అజిత్‏కు ఎక్కువగానే ఉంది. అజిత్ నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే సినిమాల్లోనే కాకుండా.. బయట ఎక్కువగా అజిత్ న్యాచురల్ లుక్‏లోనే కనిపిస్తాడు. తెల్ల గడ్డం, తెల్ల జుట్టుతో కనిపిస్తుంటాడు.. ఇక సినిమాల్లో కూడా అదే లుక్ మెయింటెన్ చేస్తుంటాడు.

తాజాగా సోషల్ మీడియాలో అజిత్ ఫ్యామిలీ ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమారుడు అద్విక్ బర్త్ డేను కుటుంబంతో కలిసి ఎంతో ఘనంగా సెలబ్రెట్ చేసుకున్నాడు. తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్‏లో సందడి చేశారు అజిత్.. అతని భార్య హీరోయిన్ షాలిని.. కొడుకు.. కూతురితో కలిసి అజిత్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో అజిత్ మేకప్ లేకుండా.. పూర్తిగా న్యాచురల్ లుక్ లో కనిపించాడు. తెల్ల గడ్డం, తెల్ల జుట్టుతో ఉన్న అజిత్ లుక్‏ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అజిత్ నటించిన వలిమై.. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 130 నుంచి రూ. 140 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లుగా అంచనా.

Ajith

Ajith

Also Read: Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..

Siddhu Jonnalagadda: కుర్ర హీరోకు క్యూ కడుతున్న ఆఫర్లు.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌తో డీజే టిల్లు..?

Diet For Jaundice: పచ్చ కామెర్లు ఉన్నవారు తినాల్సిన ఆహారపు పదార్థాలు.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్..

Deepika Pilli: క్యూట్ లుక్స్ తో దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్

ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
ఇదెక్కడి అన్యాయం అగార్కర్ భయ్యా.. తుఫాన్ ప్లేయర్‌కు హ్యాండిస్తారా
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
బంగారం ధరిస్తే.. ఈ రాశుల వారికి లెక్కలేనన్ని లాభాలు.. ఎదురులేదంతే
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
పండిన అరటి పండ్లతో దోసెలు.. వీటిని ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
ఖర్జూరం,పాలు 15రోజులు తాగండి చాలు.. ఈ సమస్యలకి దూరంగా ఉండండి..!
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్