Heart Care: గుప్పెడంత గుండెకు ఏమవుతోంది..? ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నా ప్రాణానికి నో గ్యారంటీ.. ఎందుకిలా..

యుక్త వయసులోనే నూరేళ్ల ఆయుష్షు ఆవిరైపోతోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు మాయదారి గుండెపోటు. ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది.

Heart Care: గుప్పెడంత గుండెకు ఏమవుతోంది..? ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నా ప్రాణానికి నో గ్యారంటీ.. ఎందుకిలా..
Heart Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 25, 2023 | 7:11 PM

యుక్త వయసులోనే నూరేళ్ల ఆయుష్షు ఆవిరైపోతోంది. వయసుతో నిమిత్తం లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు మాయదారి గుండెపోటు. ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది. కండలు కొండల్లా పెంచాలనే ఉబలాటం… ఓవర్‌ ఫిట్‌గా కనిపించాలనే ఆతృత.. ఓవర్‌ వర్కవుట్స్‌.. పోస్ట్‌ కోవిడ్ ఎఫెక్ట్… ఇలా కారణాలు అనేకం. కానీ… వీటన్నిటికీ అతీతంగా ఇంకేదైనా కారణం ఉందా? నిండుగుండెకు భరోసా ఇచ్చే మార్గమెక్కడ?

క్షణ క్షణానికీ కౌంట్‌డౌనే..! చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. కళ్లముందే ప్రాణాలు పోతున్నాయ్‌.. తేరుకుని CPR చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ మధ్య కాలంలో సడన్‌ హార్ట్‌ ఎటాక్‌లు పెరిగిపోయాయి. హైదరాబాద్‌ కాలాపత్తర్‌లో… రబ్బానీ అనే వ్యక్తి తన బంధువుల నిఖాకు వెళ్లాడు.. పెళ్లి సందడిలో భాగంగా.. అందరితో హ్యాపీగా గడిపాడు. అదే సమయంలో.. పెళ్లి కొడుకుకు పసుపు రాస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

సికింద్రాబాద్‌లో నిండా పాతికేళ్లు కూడా లేని.. ఓ కానిస్టేబుల్‌ జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు. అప్పటి వరకూ యాక్టివ్‌గానే ఉన్నాడు.. కానీ.. క్షణాల్లోనే హార్ట్‌ ఎటాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఓ 28 ఏళ్ల యువకుడు చనిపోయాడు. కె.గంగవరం మండలం యండగండికి చెందిన గ్రామ వాలంటీర్ రాజాబాబుకు 28 ఏళ్లు. ఈనెల 16నే పెళ్లైంది. ఇంతలోనే గుండెపోటుతో అతను చనిపోవడంతో పెళ్లింట్లో విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

గుజరాత్‌లోని సుభాష్‌నగర్‌లో పెళ్లి పీటల మీదే ఓ వధువు గుండె ఆగింది. పెళ్లిపీటలపై ఉండగానే ఆమెను మృత్యువు వెంటాడింది. సడెన్ హార్ట్ స్ట్రోకే ఈ విషాదానికి కారణమని తేల్చారు వైద్యులు.

సెలబ్రిటీలు కూడా..

పునీత్‌ రాజ్ కుమార్‌ నుంచి తారక రత్న వరకూ అనేక మంది సెలబ్రెటీలు ఇంకా చాలా జీవితాన్ని చూడాల్సిన వాళ్లే. అయినా ఎందుకు గుండె ఇలా అర్థాంతరంగా ఆగిపోతోంది. ?? అప్పటివరకు నవ్వుతూనే ఉన్నారు. మనలో కలిసే ఉంటున్నారు. ఎలాంటి నొప్పీలేదు.. ఆయసమూ కనిపించడం లేదు. కానీ ఒక్కసారిగా కుప్పకూలడం ప్రాణాలు వదలడం క్షణాల్లో జరిగిపోతున్నాయి.

గుండెపోటుకు కారణం..

గుండెపోటు సమస్య ప్రధానంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వస్తుంది. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, అతిగా తినడం, ధూమపానం వంటి అంశాలు కొలెస్ట్రాల్‌కు కారణమవుతాయి. చాలా సందర్భాలలో ఇది జన్యుపరంగా కూడా ఉంటుంది. ఇది కాకుండా, ఊపిరితిత్తులలో గడ్డకట్టడం వలన, మెదడులో రక్తస్రావం, ఔషధాల అధిక మోతాదు కారణంగా, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా గుండెలో ఏదైనా వ్యాధి కారణంగా కూడా గుండెపోటు వస్తుంది.

సాధారణంగా గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ… ఇప్పుడు పాతికేళ్లలోపు వాళ్లను కూడా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. ముఖ్యంగా… ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవైనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది. యుక్త వయసులో గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

యువకుల్లో..

ప్రత్యేకంగా యువకుల్లో వస్తున్న హార్ట్ అటాక్స్ కు స్పష్గమైన కారణాలే ఉన్నాయంటున్నారు వైద్యులు. 10 శాతం గుండె పోట్ల కు కారణం ఇప్పటికీ తెలీదంటున్నారు వైద్యులు. అయితే.. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారిలో 90 శాతం హార్ట్ స్ట్రోక్స్ .. స్మొకర్స్‌తోనే వస్తున్నాయంటున్నారు. కరోనా.. దాని కోసం తీసుకున్న మందులు కూడా.. గుండెపై ప్రభావాన్ని చూపిస్తున్నాయంటూ తెగ ప్రచారం జరుగుతోంది.

ఏమైనా.. గుండె బలహీనపడింది. యువకుల్లో సైతం పనిచేయక ఆగిపోయేంత ఒత్తిడికి గురౌవుతోంది. ఇప్పటికైనా గుండెను పదిలం చేయడానికి చాలా మార్పులు రావాలి. లేకపోతే.. గుప్పెడంత గుండె.. ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరూ పసిగట్టలేరు. అందుకే.. శారీరక దాడృత్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!