AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cervical Cancer: భారత్‌లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులు.. ప్రారంభ లక్షణాలు ఎలాఉంటాయంటే

దేశంలో అధిక మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రతీయేట మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించకపోవడమే. చాలా కేసులో చివరి దశలో దీనిని గుర్తించడం వల్ల అధిక మంది మరణిస్తున్నారు. దీని లక్షణాలు, నివారణ చర్యలు ఇక్కడ తెలుసుకుందా..

Cervical Cancer: భారత్‌లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ కేసులు.. ప్రారంభ లక్షణాలు ఎలాఉంటాయంటే
Cervical Cancer
Srilakshmi C
|

Updated on: Oct 24, 2024 | 8:20 PM

Share

మన దేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య ప్రతీయేట గణనీయంగా పెరుగుతున్నాయి. WHO ప్రకారం..2022 సంవత్సరంలో మన దేశంలో 1.27 లక్షలకు పైగా గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా సంభవించే మొత్తం మరణాలలో 25 శాతం ఒక భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో చాలా వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు అడ్వాన్స్‌డ్ అంటే చివరి దశలో గుర్తించడమే. ఈ క్యాన్సర్ లక్షణాల గురించి మహిళలకు తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీని కారణంగా వ్యాధి ఆలస్యంగా గుర్తించబడుతుంది. అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. అటువంటి పరిస్థితిలో మహిళలు సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాల గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి.

ముందుగా సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసుకుందాం..

ఈ క్యాన్సర్ మహిళల్లో గర్భాశయ ముఖద్వారంలో మొదలవుతుంది. సెర్విక్స్ అంటే స్త్రీల ప్రైవేట్ పార్ట్‌లలో ఉండే భాగం. ఇది గర్భం దిగువ భాగంలో ఉంటుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారంలో ప్రారంభమవుతుంది. దానిని సకాలంలో గుర్తించకపోతే, అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. మహిళల్లో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. HPV అనేది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఒక సాధారణ సంక్రమణం. ఈ వైరస్ స్త్రీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థను నాశనం చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ నాశనం అవదు. ఫలితంగా సంవత్సరాల తరబడి గర్భాశయంలో పెరుగుతూనే ఉంటుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని కణాలు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. కణాల అనియంత్రిత పెరుగుదల క్యాన్సర్‌కు దారితీస్తుంది. చాలా సందర్భాలలో మహిళలకు ఈ క్యాన్సర్ గురించి ప్రారంభదశలో తెలియదు.

చికిత్స ఎలా జరుగుతుంది?

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని ఓంకో గైనకాలజీ విభాగంలో డాక్టర్ సలోని చద్దా మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేస్తాం. ఇతర చికిత్సలలో క్యాన్సర్ కణాలను చంపే మందులు ఉండవచ్చు. ఇందులో రోగికి కీమోథెరపీ ఇస్తారు. రోగికి రేడియోథెరపీతో కూడా చికిత్స చేస్తారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే సులువుగా నివారించవచ్చు. అయితే చాలా వరకు ఆలస్యంగా గుర్తిస్తారని డాక్టర్ సలోని చెప్పారు. లక్షణాల గురించి అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అటువంటి పరిస్థితిలో మహిళల్లో ఈ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. క్యాన్సర్‌ను సకాలంలో గుర్తిస్తే, సులభంగా చికిత్స చేయవచ్చు. ఇది క్యాన్సర్ మరణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు ఇవే

  • పీరియడ్స్‌ రాకపోవడం
  • లైంగిక సంపర్కం తర్వాత కటి ప్రాంతంలో అంటే పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి
  • ప్రైవేట్ పార్ట్ నుంచి వైట్‌ డిశ్చార్జ్
  • బరువు తగ్గడం

గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా నివారించవచ్చు?

AIIMSలోని గైనకాలజీ విభాగంలో డాక్టర్ స్వాతి మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సహాయంతో గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 9 ఏళ్లు దాటిన బాలికలకు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. 9 నుండి 14 సంవత్సరాల వయస్సులో ఈ వ్యాక్సిన్ పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి స్త్రీ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ పొందాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే లైంగికంగా చురుకుగా మారిన తర్వాత గర్భాశయ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.

ఏ పరీక్షలు చేయాలి

రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించవచ్చని డాక్టర్ స్వాతి చెప్పారు. ఈ క్యాన్సర్‌ను టెస్ట్ చేయడానికి, పాప్ స్మెర్ లేదా HRHPV పరీక్ష ద్వారా క్యాన్సర్ కణాలను గుర్తించవచ్చు. దీంతో ఇది క్యాన్సర్‌గా మారకముందే నయం చేసుకోవచ్చు. ఇది కాకుండా మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.