Anantapur: ఇటు చర్మవ్యాధికి.. అటు ఒబేసిటీకి కలిపి మందులు వాడింది.. చివరకు..
చర్మవ్యాధి చికిత్స పేరుతో వాడిన మందులే ఓ విద్యార్థినిని బలి తీసుకున్నాయా..? ఒబేసిటీ తగ్గించేందుకు తీసుకున్న అదనపు డోసులు ప్రాణాంతకంగా మారాయా..? అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న మాధుర్య ఆకస్మిక మృతి విద్యార్థుల్లో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు ఇలా ..

చర్మ వ్యాధికి వాడిన మెడిసన్ ఆ విద్యార్థినిని బలి తీసుకుంది. దీంతో తల్లిదండ్రులతో పాటు స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. చర్మ వ్యాధితో పాటు.. ఒబేసిటీ మందులు డోస్ ఎక్కువ విద్యార్థిని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో చోటుచేసుకుంది. నందికొట్కూరుకు చెందిన విద్యార్థిని మాధుర్య గత కొంతకాలంగా స్కిన్ ట్రీట్మెంట్‌తో పాటు.. ఒబేసిటీ కారణంగా బరువు తగ్గేందుకు కూడా మందులు వాడుతుంది. ఎస్కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నమాధుర్య అక్కడే హాస్టల్లో ఉంటుంది. ఇటీవల ఆమెకు ఫిట్స్ రావడంతో యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మాధుర్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విద్యార్థిని మాధుర్య చర్మవ్యాధికి.. అదేవిధంగా ఒబెసిటీకి వాడుతున్న మందుల డోస్ ఎక్కువ అవ్వడం వల్ల గుండె నొప్పితో పాటు… ఫిట్స్ కూడా వచ్చి చనిపోయినట్లు వైద్యులు భావిస్తున్నారు. విద్యార్థిని మాధుర్య ఆకస్మిక మృతితో తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె చర్మవ్యాధికి.. ఒబేసిటీకి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటుంది…? ఏం మందులు వాడుతుంది…? మందుల కాంబినేషన్ ఏమైనా వికటించిందా..? అనే దానిపై ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. మాధుర్య మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




