Amla For Winter: శీతాకాలపు సూపర్ ఫుడ్ ‘ఉసిరి’.. ప్రత్యేకంగా ఈ సీజన్ లోనే ఎందుకు తినాలంటే!
శీతా కాలంలో ఉసిరి కాయకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు పెద్దలు. అందులోనూ ఈ సీజన్ లో ఉసిరి విరివిగా లభిస్తుంది. ఉసిరిలో చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా చలి కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో శరీరం తర్వగా బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు గురవుతుంది. అందుకే ఈ కాలంలో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతూ ఉంటారు. చలి కాలంలో ఉసిరి కాయను తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే శీతా కాలం 'సూపర్ ఫుడ్ ఉసిరి' అని అంటారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి బలం చేకూర్చడమే కాకుండా..

శీతా కాలంలో ఉసిరి కాయకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు పెద్దలు. అందులోనూ ఈ సీజన్ లో ఉసిరి విరివిగా లభిస్తుంది. ఉసిరిలో చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా చలి కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో శరీరం తర్వగా బ్యాక్టీరియా, ఇతర వ్యాధులకు గురవుతుంది. అందుకే ఈ కాలంలో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతూ ఉంటారు. చలి కాలంలో ఉసిరి కాయను తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే శీతా కాలం ‘సూపర్ ఫుడ్ ఉసిరి’ అని అంటారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి బలం చేకూర్చడమే కాకుండా.. ఇతర వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. శీతా కాలంలో ఉసిరిని తప్పనిసరిగా మీ ఆహారంలో చేర్చుకోవాలి. దీని వలన మీ శరీరానికి బలం చేకూరుతుంది. ఉసిరితో తయారు చేసే వంటలను తప్పకుండా తీసుకోవాలి. వాటిల్లో కొన్ని మీకోసం.
ఉసిరితో తయారు చేసే స్వీట్:
ఉసిరితో తయారు చేస్టే స్వీట్స్ లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ఉసిరి, అల్లం మిక్స్ చేసి తయారు చేసే స్వీట్ తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇస్తే.. వారిలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
ఉసిరి కాయ పచ్చడి:
శీతా కాలంలో ఉసిరి కాయలతో తయారు చేసే పచ్చడి తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది పుల్లగా, టేస్టీగా ఉంటుంది. ఉసిరి పచ్చడిలో నూనె తక్కువగా కలిపితే ఆరోగ్యానికి ఎంతో మంచింది. ఉసిరిలో ఉండే విటమిన్ సి.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ క్రియ బాగా జరుగుతుంది. అలాగే చర్మం కూడా సాఫ్ట్ గా ఉంటుంది.
ఉసిరి రసం:
ఈ వింటర్ సీజన్ లో ఉసిరి రసం తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఉదయాన్నే పరగడుపున కొద్దిగా ఉసిరి రసం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఉసిరి రసం తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వుతారు. శరీరం కూడా సరిగ్గా డిటాక్సిఫై అవుతుంది. చిన్న పాత్రలో ఉసిరి కాయ, జీలకర్ర, నీళ్లు పోసి బాగా మరగ బెట్టాలి. ఇది బాగా మరిగాక గోరు వెచ్చగా ఉన్నప్పుడు నిమ్మ రసం, తేనె కలిపితే ఉసిరి రసం సిద్ధమవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








