Organs Donation: శరీరంలోని ఏఏ అవయవాలను దానం చేయవచ్చు.. అసలు ప్రాసెస్ ఏంటి?

Organs Donation: మరణం తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది. తద్వారా మానవ శరీరంలోని అవయవాలు మట్టిపాలవుతాయి. ఎంతో విలువైన అవయవాలు వృథా అవకుండా ఉండేందుకు

Organs Donation: శరీరంలోని ఏఏ అవయవాలను దానం చేయవచ్చు.. అసలు ప్రాసెస్ ఏంటి?
Organs
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 12, 2021 | 5:58 AM

Organs Donation: మరణం తర్వాత మన శరీరం మట్టిలో కలిసిపోతుంది. తద్వారా మానవ శరీరంలోని అవయవాలు మట్టిపాలవుతాయి. ఎంతో విలువైన అవయవాలు వృథా అవకుండా ఉండేందుకు ప్రజలు మరణం తర్వాత అవయవాలను దానం చేయడానికి అవగాహన కల్పిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా ఒకరి జీవితం ముగిసినప్పటికీ.. మరొకరి జీవితం రూపంలో మరో ప్రయాణాన్ని ప్రారంభించొచ్చు. కాగా, మనిషి చనిపోయిన తరువాత శరీరంలోని కొన్ని భాగాలను దానం చేయవచ్చు. దీని కోసం ఒక ప్రక్రియ ఉంది. ఇది చట్టబద్ధమైనది. అవయవ దానం అనేది ఒక ప్రక్రియ (దీనిలో ఆరోగ్యకరమైన అవయవాలు, కణజాలాలు మానవుడి నుండి తీసుకోబడతాయి). ఈ అవయవాలను అవసరమైన వారి శరీరాల్లోకి మార్పిడి చేస్తారు.

ఒక్క అవయవ దానం ద్వారా దాదాపు 50 మంది నిరుపేదలకు సహాయం చేయవచ్చని చెబుతారు. అధికారిక సమాచారం ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది అవయవ దానం లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. అంతేకాదు.. దేశంలో ఒక మిలియన్ మందికి 0.26 శాతం మంది మాత్రమే అవయవాలను దానం చేస్తున్నారు.

ఏ అవయవాలను దానం చేయవచ్చు.. అవయవ దానం రెండు రకాలు. మరణం తర్వాత చేసే అవయవ దానం ఒకటి.. సజీవ అవయవ దానం రెండు. ఒక వ్యక్తి అవసరమైన వారికి సహాయం చేయడానికి మూత్రపిండాలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. మరణం తర్వాత అవయవ దానంలో, మరణించిన వ్యక్తి శరీరంలో సక్రమంగా పని చేసే అవయవాలన్నీ దానం చేయవచ్చు. అలాగే.. 8 రకాల అవయవాలను దానం చేయొచ్చు. మరణించిన వ్యక్తి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, క్లోమం, ప్రేగులు వంటి అవయవాలను దానం చేయవచ్చు.

ఎవరు చేయగలరు.. ఏ వ్యక్తి అయినా అవయవ దానం చేయవచ్చు. దీనికి సంబంధించి వయస్సుపై ఎలాంటి నిర్బంధమూ లేదు. నవజాత శిశువుల నుండి 90 ఏళ్ల వృద్ధులకు అవయవ దానాలు విజయవంతమయ్యాయి. అయితే, 18 ఏళ్లలోపు వ్యక్తి తన అవయవాలను దానం చేయాలనుకుంటే, వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.

నియమాలు, నిబంధనలు.. అవయవ దానం కోసం దేశ ప్రభుత్వం కొన్ని నియమాలు, నిబంధనలు రూపొందించింది. వీటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా అవయవ దానం చేయాలనుకుంటే దాని కోసం వారు ప్రతిజ్ఞ ఫారమ్‌ను పూరించాలి. ఆ తర్వాత మాత్రమే వారు అవయవ దానం ప్రక్రియలో పాల్గొనవచ్చు. దీని కోసం www.organindia.org లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read:

Mysterious Deaths: స్మశానవాటికలో అర్థరాత్రి ‘శవాల వర్షం’.. అది చూసి జనాలు హడలిపోయారు..!

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అగ్నిప్రమాదం.. భారీగా కమ్ముకున్న పొగ..!

Viral News: బాప్‌రే ఇలా చేసిందేంటి?.. టీవీలో కనిపించిన ఆనందంలో ఓ మహిళ ఏకంగా..