AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

ఒంటిపై కొత్త పుట్టుమచ్చలు అకస్మాత్తుగా కనిపించడం, పుట్టుమచ్చలు పెద్దగా పెరిగడ వంటి లక్షణాలు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది చిన్న పుట్టుమచ్చలతో ఏం సమమ్య ఉంటుందిలే అని..

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా
Moles On Body
Srilakshmi C
|

Updated on: Jan 15, 2026 | 1:17 PM

Share

శరీరంపై పుట్టుమచ్చలు సర్వసాధారణం. కొందరు వీటిని అందానికి చిహ్నంగా భావిస్తారు. మరికొందరికి ఇవి అసహ్యంగా మారుతాయి. ఒంటిపై కొత్త పుట్టుమచ్చలు అకస్మాత్తుగా కనిపించడం, పుట్టుమచ్చలు పెద్దగా పెరిగడ వంటి లక్షణాలు కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది చిన్న పుట్టుమచ్చలతో ఏం సమమ్య ఉంటుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు పుట్టు మచ్చలకి, ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటంటే..

పుట్టుమచ్చ అంటే ఏమిటి?

మన చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండటం వల్ల మచ్చలు ఏర్పడతాయి. చర్మంపై మెలనోసైట్లు అనే కణాలు ఒకే చోట చేరి ఎక్కువ వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసినప్పుడు అది ఒక చిన్న మచ్చగా కనిపిస్తుంది. ఇవి నలుపు, గోధుమ, లేత గులాబీ లేదా నీలం రంగులో ఉండవచ్చు.

శరీరంపై మచ్చలు పెరగడానికి కారణమేమిటి?

  • సగటు వ్యక్తి శరీరంపై 10 నుంచి 40 పుట్టుమచ్చలు ఉండటం సాధారణం. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు దానిని విస్మరించకూడదు.
  • మీ ఇంట్లో ఎవరి ఒంటిపై అయినా చాలా పుట్టుమచ్చలు ఉంటే అవి తరువాతి తరానికి సంక్రమించే అవకాశం ఉంది.
  • యుక్తవయస్సు లేదా గర్భధారణ సమయంలో సంభవించే హార్మోన్లలో మార్పులు కొత్త మచ్చలు కనిపించడానికి కారణమవుతాయి.
  • సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. అందుకే సూర్యరశ్మికి గురయ్యే శరీర భాగాలపై మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి.
  • వయసు పెరిగే కొద్దీ చర్మంలో వచ్చే మార్పులు మచ్చలు పెరగడానికి దారితీస్తాయి.

పుట్టు మచ్చలు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతాయి?

చాలా పుట్టుమచ్చలు ప్రమాదకరం కాదు. అయితే ఒక పుట్టుమచ్చ అకస్మాత్తుగా పరిమాణం పెరిగితే మీరు వైద్యుడిని సంప్రదించాలి. పుట్టుమచ్చలో రెండు లేదా మూడు రంగులు కనిపిస్తే, లేదా అది నల్లగా మారితే విస్మరించకూడదు. పుట్టుమచ్చ ఉన్న ప్రదేశంలో నిరంతర దురద లేదా నొప్పి ఉంటే. ఒక పుట్టుమచ్చ నుంచి ఎటువంటి గాయం లేకుండా రక్తస్రావం అవుతుంటే దానిని విస్మరించకూడదు.

ఇవి కూడా చదవండి

ఇటువంటి మార్పులు చర్మ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చు. కాబట్టి వాటిని విస్మరించడం మంచిది కాదు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.