Walking Meditation: ఒత్తిడికి చెక్ పెట్టాలనుకుంటున్నారా.? ఈ వ్యాయామం చేస్తే చాలు.. దెబ్బకు హాంఫట్
నడక ధ్యానం అనేది చలనంలో ధ్యానం. కళ్లు మూసుకుని కూర్చోవడం లేదా నిలబడడం బదులు, శరీరాన్ని కదిలించడం, స్వచ్ఛమైన గాలిని తీసుకోవడమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆగస్టు 2022 నుంచి ఈ తరహా ధ్యానం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
ధ్యానం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యం కోసం ప్రశాంత వాతావరణంలో ఓ చోట స్థిరంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం మనకు తెలుసు. అయితే నడక ధ్యానం అనేది చలనంలో ధ్యానం. కళ్లు మూసుకుని కూర్చోవడం లేదా నిలబడడం బదులు, శరీరాన్ని కదిలించడం, స్వచ్ఛమైన గాలిని తీసుకోవడమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆగస్టు 2022 నుంచి ఈ తరహా ధ్యానం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ధ్యానం చేయడానికి ముఖ్య కారణం శరీరాన్ని, మనస్సును ఒకదానితో ఒకదాన్ని సమలేఖనం చేయడం. వాకింగ్ మెడిటేషన్ లో ముఖ్యంగా శరీర కదలికలపై దృష్టి పెట్టాలి.
వాకింగ్ మెడిటేషన్ కు రెగ్యులర్ వాకింగ్ కు తేడా ఏంటి?
రెగ్యులర్ వాకింగ్ ముఖ్య ఉద్దేశం కేవలం శరీరానికి తగిన వ్యాయామం అందించడమే. కానీ వాకింగ్ మెడిటేషన్ అంటే శరీరంతో పాటు మనస్సుకు కూడా వ్యాయామం అందించడమని సైకోథెరపిస్టులు చెబుతున్నారు. అలాగే వాకింగ్ మెడిటేషన్ సమయంలో కేవలం పరిసరాల శబ్దాలను గమనించాలని, అనుసరించకూడదని సూచిస్తున్నారు. అయితే వాకింగ్ మెడిటేషన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- వాకింగ్ మెడిటేషన్ చేయడానికి ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి
- మెడిటేషన్ చేయడానికి కావాల్సినంత సమయాన్ని వెచ్చించాలి.
- శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి.
- స్థిరమైన వేగంతో నడవాలి
- మీ ఫీలింగ్స్ పై దృష్టి పెట్టాలి.
- పరిసరాల శబ్దాలను గమనించాలని కానీ అనుసరించకూడదు.
వాకింగ్ మెడిటేషన్ ప్రయోజనాలు
వాకింగ్ మెడిటేషన్ ఒత్తిడి తగ్గించడానికి సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీన్ని నచ్చినంత కాలం చేయవచ్చని నిర్ధిష్ట నియమాలు లేవని పేర్కొంటున్నారు. అలాగే వాకింగ్ మెడిటేషన్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే రక్తప్రసరణ మెరుగవుతుందని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..