Early Wakeup: తెల్లారకముందే నిద్రలేచే అలవాటు మీకూ ఉందా? ఐతే మీరు చిక్కుల్లో పడ్డట్టే..

జీవితంలో విజయశిఖరాలను అధిరోహించాలంటే స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేవడం అటు కెరీర్‌కు, ఇటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు అంటుంటారు. ఐతే రొటీన్‌కు భిన్నంగా తాజా అధ్యయనాలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి..

Early Wakeup: తెల్లారకముందే నిద్రలేచే అలవాటు మీకూ ఉందా? ఐతే మీరు చిక్కుల్లో పడ్డట్టే..
Waking up early in the morning
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2022 | 12:40 PM

జీవితంలో విజయశిఖరాలను అధిరోహించాలంటే స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేవడం అటు కెరీర్‌కు, ఇటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ప్రపంచంలో పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా ఉదయాన్నే నిద్రలేచి తమ దినచర్యను ప్రారంభిస్తారని చాలా సార్లు వినే ఉంటారు. ఎంతో మంది తమ ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. ఐతే రొటీన్‌కు భిన్నంగా తాజా అధ్యయనాలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి.

విజయ రహస్యం అదేనంటే పొరబాటే..

ఉదయాన్నే బలవంతంగా మేల్కొనడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని సైంటిస్టులు అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే నిద్ర లేవడం కొన్నిసార్లు ఆరోగ్యానికి తీవ్ర హాని తలపెడుతుందట. ఉదయాన్నే నిద్రలేచే అలవాటును ఇకపై విజయాన్ని కొలవడంతో పోల్చకూడదని తాజా పరిశోధన చెప్పకనే చెబుతోంది. నిజానికి ఉదయాన్నే నిద్రలేచినంత మాత్రాన విజయం దానంతట అది వరించదు. సక్సెస్‌కు హార్డ్‌వర్క్‌, పట్టుదల వంటి ఇతర చాలా విషయాలు కలపాలి. సాధారణంగా ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. పొద్దున్నే నిద్రపోవడానికి ఇష్టపడే వారు ఒకరకమైతే.. ఉదయాన్నే నిద్రలేవడానికి ఇష్టపడేవారు మరోరకం. ప్రపంచంలోని మొత్తం జనాభాలో నాల్గవ వంతు మంది ప్రజలు ఉదయాన్నే లేవడానికి ఇష్టపడతారు. ఇక అదే సంఖ్యలో రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారు కూడా ఉన్నారు.

అధ్యయనం ఏం చెబుతోందంటే..

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొనే వ్యక్తులు ఎక్కువ ఊహాత్మకంగా ఉంటారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఇక వేకువ జామున నిద్రలేచిన వారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకుంటారట.

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల కలిగే నష్టాలు..

శరీర గడియారానికి వ్యతిరేకంగా ఉదయాన్నే నిద్రలేస్తే, ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావం చూపుతుంది. ఇలా తగినంత విశ్రాంతి ఇవ్వకుండా బలవంతంగా నిద్రలేస్తే శరీరం మంచి ఫలితాలను ఇవ్వదు. ఒక వ్యక్తిని రాత్రిపూట ఆలస్యంగా పడుకుని, తెల్లవారుజామునే లేవమని చెబితే.. ఆ రోజంతా అతను పని చేయడానికి తక్కువ శ్రద్ధ చూపుతాడు. ఇటువంటి వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుంది. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా దాడి చేస్తాయి.

మరిన్ని తాజా హెల్త్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?