AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Way of Drinking Water: మంచినీటిని ఇలా మాత్రం అస్సలు తాగకండి.. మా ఇష్టం అంటారా? ఈ ప్రమాదం తప్పదు మరి..

నీరు మన శరీరానికి అవసరమైన, ముఖ్యమైన వాటిలో ఒకటి. ఆహారం కొద్ది రోజులు తినకుండా అయినా ఉండొచ్చు కానీ, నీరు లేకుండా ఉండలేరు. శరీరంలో నీటి శాతం తగ్గితే.. అవయవాల పనితీరులో మార్పులు వస్తాయి.

Way of Drinking Water: మంచినీటిని ఇలా మాత్రం అస్సలు తాగకండి.. మా ఇష్టం అంటారా? ఈ ప్రమాదం తప్పదు మరి..
Drinking Water
Shiva Prajapati
|

Updated on: Dec 13, 2022 | 12:24 PM

Share

నీరు మన శరీరానికి అవసరమైన, ముఖ్యమైన వాటిలో ఒకటి. ఆహారం కొద్ది రోజులు తినకుండా అయినా ఉండొచ్చు కానీ, నీరు లేకుండా ఉండలేరు. శరీరంలో నీటి శాతం తగ్గితే.. అవయవాల పనితీరులో మార్పులు వస్తాయి. తద్వారా అనారోగ్యానికి గురవుతారు. జీర్ణక్రియ, బరువు తగ్గడం వంటి ముఖ్యమైన శరీర విధుల్లో నీరు ఘననీయమైన పాత్ర పోషిస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే.. శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలోకి తీసుకురావడానికి చెమట పడుతుంది. తద్వారా శరీరం నీటిని కోల్పోతుంది. మరి కోల్పోయిన నీటిని నింపడానికి ఎక్కువ నీరు తాగాల్సి ఉంటుంది. లేదంటే.. డీహైడ్రేషన్, మలబద్ధకం, అలస, ఉదర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాలకే ముప్పు కలిగిస్తుంది.

నీటితో ప్రయోజనాలు..

శరీరంలోని అవయవాలను హైడ్రేట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కీళ్లలో ద్రవం ఉండేలా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. కణాల ఆరోగ్యాన్ని పోత్సహిస్తుంది. శరీరానికి ఎంతటి ఉపయోగకరమైన నీటిని.. సరైన విధానాలో తాగాల్సిన అవసరం ఉంది. నీరు తాగకపోవడం వల్ల ఎన్ని దుష్ప్రభావాలు కలుగుతాయో.. నీటిని సరిగా తాగకపోవడం వల్ల కూడా అంతే దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే నీరు తాగే విధానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు.

నీటితో సరిగా తాగకపోతే కలిగే దుష్ప్రభావాలు..

నీరు తాగే విధానం ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. నీరు నిల్చుని తాగినప్పుడు దాని వేగం కారణంగా అజీర్తి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆర్థరైటిస్‌ సమస్యను పెంచుతుంది. నీరు తాగే సమయంలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే.. అది ఊపిరితిత్తులకు కూడా హానీ తలపెడుతుంది.

ఇవి కూడా చదవండి

నీటిని ఎలా తాగాలి..

ముందు సరిగా కూర్చోవాలి. వీపును నిటారుగా ఉంచి.. ఆ తరువాత నీటిని తాగాలి. ఇలా చేయడం ద్వారా నీరు మెదడుకు కూడా అందుతుంది. తద్వారా మెదడు కార్యకలాపాలు మెరుగవుతాయి. జీర్ణక్రియలో ఇది సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు.. కండరాలు, నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతాయి. మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించదు. సులభంగా వడపోత పక్రియను చేయగలుగుతాయి.

కొంచెం కొంచెం తాగాలి..

ఒకేసారి ఎక్కవ నీటిని తాగొద్దు. కొంచెం కొంచెం నీటిని తాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు తాగడం వల్ల శ్వాసనాళంలోకి నీరు చేరి ఇబ్బంది పడే ప్రమాదం గురి చేస్తుంది. ఇది ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా అవ్వొచ్చు. అందకే కొంచెం కొంచెం నీటిని తాగాలి. ఇలా చేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలోనూ ఉపకరిస్తుంది.

చల్లని నీరు అస్సలు తాగొద్దు..

వేసవి కాలం అయినా సరే.. చల్లని నీరు అస్సలు తాగొద్దు. చన్నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. శరీరంలోని వివిధ అవయవాలకు రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుంది. చల్లని నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అందుకే గది ఉష్ణోగ్రత వద్ద నీటిని తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.

రాగి పాత్రల్లో నీరు..

పురాతన కాలంలో ప్రజలు రాగి, వెండి గ్లాసుల్లో నీరు తాగేవారు. ఈ లోహాలతో తయారు చేసిన గ్లాసుల్లో నీరు ఉంచడం వల్ల శరీరానికి అవసరమైన ఖనిజాను సమతుల్యం చేస్తాయి. శరీరానికి పాజిటివ్‌నెస్ ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ లోహాలకు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి.

దాహంగా ఉన్నప్పుడే తాగాలి..

శరీరానికి నీరు అవసరం అయితే వెంటనే మనకు సంకేతాలు తెలుస్తాయి. దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అంతకు మించి తాగడం వల్ల ఉపయోగం లేదు. పైగా కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.

గమనిక: వ్యాసంలో పేర్కొన్న చిట్కాలు, సూచనలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. వీటిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..