Viral Video: కింగ్ కోబ్రాకు లిప్‌లాక్ పెట్టిన బుడ్డోడు.. వీడియో చూస్తే జంబలకిడి జారు మిటాయే..

Viral Video: చిన్న పురుగులను చూస్తేన హడలిపోతారు కొందరు. అలాంటిది ప్రాణాంతకమైన పాము కనిపిస్తే.. వామ్మో అని అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇక పాముల్లోనే డేంజర్ అయిన కింగ్ కోబ్రా కంట పడితే..

Viral Video: కింగ్ కోబ్రాకు లిప్‌లాక్ పెట్టిన బుడ్డోడు.. వీడియో చూస్తే జంబలకిడి జారు మిటాయే..
Boy Kissed Cobra
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 11, 2022 | 8:52 AM

చిన్న పురుగులను చూస్తేన హడలిపోతారు కొందరు. అలాంటిది ప్రాణాంతకమైన పాము కనిపిస్తే.. వామ్మో అని అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇక పాముల్లోనే డేంజర్ అయిన కింగ్ కోబ్రా కంట పడితే.. ఇంకేమైనా ఉంది. చెప్పులు చేతపట్టుకుని లగెత్తుడే తరువాయి అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఇంకొందరు ధైర్యం చేసి, వాటిని కొట్టి చంపేస్తుంటారు. ఇక, స్నేక్ క్యాచర్స్ చిన్న పాము మొదలు, కింగ్ కోబ్రాలు, కొండ చిలువులను పట్టుకోవడం, వాటిని రక్షించడం కోసం నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేయడం వంటివి మనం నిత్యం చూస్తేనే ఉన్నాం.

ఈ సంగతి ఇలా ఉంటే.. అభశుభం తెలియని పిల్లలకు పాములకు, పురుగులకు తేడా తెలియదు. వారి ముందున్న ప్రతీది ఆటవస్తువుగానే ఉంటుంది. అది ప్రాణం వస్తువు అయినా, ప్రాణం ఉన్న జంతువు అయినా, వాటితో ఆడుకోవడమే వారికి తెలుసు. తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన భారీ సైజు కింగ్ కోబ్రాతో సరదాగా ఆటాడేసుకున్నాడు చంటి పిల్లాడు. నిండా 2 సంవత్సరాలైనా ఉంటుందో లేదో తెలియదు కానీ, ఆ బుడ్డోడికి 4 రెట్లు పొడవైన పెద్ద కింగ్‌ కోబ్రాతో సరదాగా ఆడుకున్నాడు. దాని మెడ పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. అదేదో వస్తువు అన్నట్లుగా దానిని దగ్గరకు తీసుకోగా.. ఆ కింగ్ కోబ్రా కూడా బుడ్డోడిని ఏమీ అనలేదు. పైగా, ఆ పిల్లాలు దానికి ముద్దు పెట్టాడు. దాంతో భయపడిన పాము.. వాడి నుంచి దూరం జరిగింది. పాము అలా పక్కకు జరగడంలో కేర్‌మని ఏడ్చాడు బుడ్డోడు. వాస్తవానికి అది పెంపుడు పాములా ఉంది. అందుకే ఆ పిల్లాడు దానిని ఏమన్నా పట్టించుకోలేదు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియోను rajibul9078 పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ యూజర్ పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 17 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు భయపడుతూ కామెంట్స్ పెడుతున్నారు. పిల్లాడికి చాలా ధైర్యం ఉందంటూ కొందరు.. పిల్లల ప్రాణాలతో ఆటలొద్దు అని మరికొందరు స్పందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్నా పిల్లాడి వీడియోను కింద చూడొచ్చు..

View this post on Instagram

A post shared by Rajibul Islam (@rajibul9078)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి