Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంటలకు గంటలు కూర్చుని పని చేస్తున్నారా.. ఈ సమస్యలకు వెల్ కమ్ చెప్పినట్లే..

ప్రస్తుతం కాలంలో చాలా మంది కూర్చుని పని చేసే విధానానికి అలవాటు పడ్డారు. గంటలకు గంటలు కంప్యూటర్ ముందు తిష్ఠ వేస్తున్నారు. పని మధ్యలో అప్పుడప్పుడు లేచి నడవాలనే ఆలోచనను కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు చేసే యువత సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే కొన్ని ఉద్యోగాల్లో తప్పనిసరిగ్గా ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేయాల్సి వస్తుంది. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...

Ganesh Mudavath

|

Updated on: Dec 13, 2022 | 10:56 AM

ఎక్కువసేపు కూర్చుని పని చేసే వారు ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల శరీరంలోని లిపోప్రొటీన్ లైపేస్ కొద్ది మొత్తంలో విడుదల అవుతుంది, దీని వల్ల వివిధ ప్రదేశాలలో కొవ్వు పేరుకుపోతుంది. టెక్ జాబ్స్‌లో నిమగ్నమైన వ్యక్తుల పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది. అలాంటి వ్యక్తులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం కావచ్చు.

1 / 5
గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోయి పని చేసేవారు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కంప్యూటర్‌లో పనిచేయకున్నా తమ కార్యాలయాల్లో ఒకే చోట కూర్చొని గంటల తరబడి పనిచేసినా వారు గుండె సంబంధ  సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలకు చేరువవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2 / 5
ఆలా పనిచేసేవారు మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలకు గురికావాల్సి ఉంటుంది.  ఎలాంటి విరామం లేకుండా ఎక్కువసేపు కంప్యూటర్ ముందే కూర్చొని పని చేస్తే వీరికి గుండె పోటు వచ్చే అవకాశాలు 40 శాతం అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అయితే ఈ పరిస్థితికి రావడానికి వివిధ సమస్యలు దోహదం చేస్తాయి.

3 / 5
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పని చేస్తే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇన్సులిన్ సామర్థ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా మంది ఎముకలు, కండరాల్లో నొప్పులు వస్తాయి. అలాగే వారి మోకాళ్లు, మోచేతులు, మెడలో కూడా నొప్పి వస్తుంది.

4 / 5
ల్యాప్‌టాప్‌ల మీద పని చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు సోఫాలు, మంచాలపై కాకుండా నేలపై నిటారుగా కూర్చోవాలి. రెండు గంటలు దాటితే చేతుల్ని నిటారుగా పైకెత్తడం, గుండ్రంగా, సవ్య, అపసవ్య దిశల్లో తిప్పడం వంటివి చేయడం వల్ల వెన్ను, భుజాలు, చేతి కండరాలు బలంగా మారతాయి.

5 / 5
Follow us