Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణాలే పోతాయ్..!

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. అది సరిగా పనిచేస్తేనే మనం మన పనులు సక్రమంగా చేసుకుంటాం లేదంటే ఆస్పత్రిలో బెడ్‌పై పడుకోవాల్సి వస్తుంది. శరీరంలోనే అతిపెద్ద అవయం అయిన కాలేయం..

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణాలే పోతాయ్..!
Health Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 11, 2022 | 2:01 PM

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. అది సరిగా పనిచేస్తేనే మనం మన పనులు సక్రమంగా చేసుకుంటాం లేదంటే ఆస్పత్రిలో బెడ్‌పై పడుకోవాల్సి వస్తుంది. శరీరంలోనే అతిపెద్ద అవయం అయిన కాలేయం.. మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలెయం రక్తంలో రసాయనాల స్థాయిని నియంత్రిస్తుంది. పోషకాలను అందిస్తుంది. కాలెయం దాదాపు 500 రకాల కంటే ఎక్కువ పనులు చేస్తుంది.

కాలెయం చేసే కొన్ని ముఖ్యమైన విధులు..

1. జీర్ణక్రియలో సహాయపడే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

2. ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

3. శరీరానికి అవసరమైన కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది.

4. అదనపు గ్లూకోజ్‌ని గ్లైకోజెన్‌గా మారుస్తుంది.

5. రక్తం గడ్డకట్టకుండా నియంత్రిస్తుంది.

6. అంటువ్యాధులను నివారిస్తుంది.

7. రక్త కణాలను శుభ్రపరుస్తుంది.

కాలేయం ఆరోగ్యం దెబ్బతింటే కనిపించే లక్షణాలు..

కాలెయం దెబ్బతినడం, వైఫల్యం చెందడం ప్రాణాంతకమైనది. దీనికి అత్యవసరమైన చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే, కాలెయం దెబ్బతినడం అకస్మాత్తుగా జరుగదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. దీనికి కారణం వైరస్‌లు, ఆల్కాహాల్, ఊబకాయం వంటివి ఉన్నాయి. కాలెయం ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు సిర్రోసిస్‌కు దారి తీస్తాయి. ఇది మరణానికి దగ్గర చేస్తుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి..

1. చర్మం, కళ్లు పసుపు రంగులో కనిపిస్తాయి. దీనినే కామెర్లు అంటాం. ఇది తీవ్రంగా అయితే, ప్రాణాంతకంగా మారుతుంది.

2. కాలెయం ఆరోగ్యం క్షీణించినట్లయితే.. చర్మంపై దురద వస్తుంది. పిత్త వాహికలో రాళ్లు, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ప్రైమరీ బిలియరీ సిర్రోసిస్ వల్ల కూడా ఇది వస్తుంది.

3. తరచుగా రక్తస్త్రావం అవుతుంటుంది. గాయాలు, రక్తస్రావం కాలేయం ఆరోగ్యం బాగోలేదనడానికి సంకేతం. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన నిర్దిష్ట ప్రోటీన్లు లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది.

4. పాదాలు ఎక్కువ సమయం ఉబ్బినట్లు ఉండటం కూడా కాలేయం అనారోగ్యానికి సూచికనే.

5. కాలెయం అనారోగ్యం కారణంగా.. చాలా మందిలో నిద్రలేమి సమస్య వస్తుంది. లివర్ సిర్రోసిస్ ఉన్న రోగులకు అబ్‌స్ట్రక్టీవ్ స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఉంది. రక్తంలో విష పదార్థాలు చేరడం వల్ల నిద్ర చెరిగిపోతుంది. కొంతమంది రోగులు కోమాలోకి కూడా వెళ్లవచ్చని వైద్యులు చెబుతున్నారు.

6. కాలెయ వ్యాధి దీర్ఘకాలికంగా మారితే పొత్తికడుపులో ద్రవం పేరుకుపోయి.. ఉదర విస్తరణకు కారణమవుతుంది. ఉబ్బిన బొడ్డు సిర్రోసిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్, హెపాటిక్ సిరకు కూడా కారణమవుతుంది.

ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి..?

1. ఆరోగ్యకరమైన బరువు మెయింటెన్ చేయాలి.

2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

3. మద్యం సేవించడం మానేయాలి.

4. విటమిన్ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవద్దు.

5. టాక్సిన్స్ తొలగించే పదార్థాలను తీసుకోవాలి.

6. దూమపానం ఆపేయాలి.

గమనిక: ఇది ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..