Parenting Tips: పాపాయికి పాలు పట్టిస్తున్నప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి.. ఇలా మాత్రమే చేయండి..

మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే.. పాల సీసా గురించి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. లేకపోతే, త్వరలో ఏదో అలవాటు పెద్ద అనారోగ్య సమస్యలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది.

Parenting Tips: పాపాయికి పాలు పట్టిస్తున్నప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి.. ఇలా మాత్రమే చేయండి..
Bottle Feeding
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 11, 2022 | 1:05 PM

దేశవ్యాప్తంగా చాలా మంది తల్లులు తమ పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్లతో తాగిపిస్తున్నారు. అయితే దేశంలోని విక్రయించే పాల సీసాలు, సిప్పర్ కప్పుల తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించబడుతున్నాయనే సంగతి తెలిస్తే మీరు షాకవుతారు. ఇది మీ పిల్లలకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకుంటే.. అతని పాల సీసా గురించి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి. లేకపోతే, త్వరలో ఏదో పెద్ద జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. కొన్ని పరిశోధన ప్రకారం, పాల సీసాలు, సిప్పర్ కప్పులలో కొన్ని హానికరమైన రసాయనాలను గుర్తించారు. దీనిని ‘బిస్ఫినాల్-ఎ’ అని పిలుస్తారు. అందుకే పిల్లలు ఈ రకమైన బాటిల్‌ను ఉపయోగించినప్పుడు.. అది వారికి చాలా ప్రమాదకరమని గుర్తించడం జరిగింది. వీటిని ఉపయోగించడం వల్ల పిల్లల పేగు, కడుపు మధ్య మార్గాన్ని నిరోధించవచ్చు ఎందుకంటే ఈ రసాయనం వేడి పాలతో కలిసిపోయి కడుపులో పేరుకుపోతుంది. దీంతో చిన్నారుల ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారే అకాశం ఉంది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 2015 నుంచి పాలికార్బోనేట్‌తో తయారు చేసిన బేబీ బాటిళ్లను నిషేధించింది. ఇది కాకుండా, ఏదైనా నాసిరకం కంపెనీల బాటిళ్లను ఉపయోగించడం మానుకోవాలి. ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. కొన్నిసార్లు చిన్న పిల్లలు చనిపోయే ఛాన్స్ కూడా అధికంగా ఉంది. నాసిరకం సీసాలో పాలు తినిపిస్తే శిశువులకు విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది.

ఏ వయసులోని వారికి..

  1. పిల్లలకు రోజుకు ఒక కిలో బరువ్ఞకు 150మి.లీ. చొప్పున పాలు ఇవ్వాలి. అంటే 5 కిలోలు ఉన్న బాబుకు రోజుకు 750 మి.లీ. వరకు పాలు ఇవ్వాలి. ఈమొత్తం ఐదు ఆరు భాగాలుగా విభజించి రోజు మొత్తంమీద ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలకు కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి.
  2. డబ్బా లో పాలపొడి 30ఎం.ఎల్‌ నీటికి, ఒక చంచాడు చొప్పున కలపాలి. ఇలా కలిపితేనే సరియైన పోషకపదార్థాలు పిల్లవాడికి లభిస్తాయి. కొంత మంది తల్లులు ఒక గ్లాసు నీటికి (150ఎం.ఎల్‌) ఒక చెంచా పాలపొడి కలుపుతారు.
  3. ఇలా చేస్తే పిల్లలకు పోషక పదార్థాలు లభ్యం కావ్ఞ. ఎదుగుదల దెబ్బతింటుంది.
  4. డబ్బాపాలుమాత్రమే తీసుకొనే పిల్లవానికి 1/2 కె.జి డబ్బా3, 4 రోజులు 1 కె.జి డబ్బా 6,7 రోజుల కంటే ఎక్కువ రాదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం