ప్రియుడికి గిఫ్ట్ కోసం భారీ చోరీ చేసిన ప్రేయసి.. కట్ చేస్తే కత వేరే లెవల్లో ఉంది భయ్యా.. ఓ లుక్కేసుకోండి..
ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం సహజమే. అయితే, మన వద్ద ఉంటే గిఫ్ట్ ఎన్ని అయినా, ఎంత ఖరీదైనవైనా ఇచ్చుకోవచ్చు. అలాకాకుండా.. మరీ ఓవర్ ఫీల్ అయిపోయి తమ భాగస్వామికి ఖరీదైన, సర్‌ప్రైజ్ గిఫ్ట్ కోసం చెత్త ప్రయోగాలు చేస్తే..
ప్రేమికులు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం సహజమే. అయితే, మన వద్ద ఉంటే గిఫ్ట్ ఎన్ని అయినా, ఎంత ఖరీదైనవైనా ఇచ్చుకోవచ్చు. అలాకాకుండా.. మరీ ఓవర్ ఫీల్ అయిపోయి తమ భాగస్వామికి ఖరీదైన, సర్‌ప్రైజ్ గిఫ్ట్ కోసం చెత్త ప్రయోగాలు చేస్తే.. తరువాత జరిగే పరిణామాలు ఊహకు కూడా అందని స్థితిలో ఉంటుంది. అలాంటి పరిస్థితే ఎదుర్కోంటుంది ఓ యువతి. తన ప్రియుడికి ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చేందుకు ఎవరూ ఊహించని విధంగా చోరీకి పాల్పడింది. కట్ చేస్తే జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎవర్ షైన్ సిటీలోని రష్మీ గార్డెన్‌లో నివాసం ఉంటున్న దివ్య సురేష్ పటేల్ ఇంట్లో నగదు, నగలు పోయాయి. చోరీకి గురైనట్లు గమనించిన దివ్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర క్లూస్ కోసం ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దాంతో బాధిత మహిళను కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఈ డబ్బు, నగలు గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో విచారణ ప్రారంభించారు. బాధితురాలికి పరిచయం ఉన్న యువతులు, మహిళలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అసలు దొంగను గుర్తించారు పోలీసులు.
విచారణలో భాగంగా ఓ యువతి ఇటీవల తన ప్రియుడి కోసం పెద్ద మొత్తంలో ఫర్నీచర్, నగలు, బైక్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఎలాంటి ఆదాయం లేకుండానే ఆమె అంత డబ్బు పెట్టి ఎలా ఇవన్నీ కొనుగోలు చేసిందనే విషయంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యువతిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం బయటపడింది. యువతి తాను చేసిన చోరీని అంగీకరించింది. నిందితురాలి నుంచి రూ. 4.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలసులు. మిగిలిన డబ్బుతో వస్తువులు కొనుక్కున్నట్లు గుర్తించారు. ఇలా దోచుకున్న సొమ్ముతో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సరదాగా గడిపేదని తెలిపారు పోలీసులు.
కాగా, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. యువతి ప్రియుడు మైనర్. చోరీకి పాల్పడిన యువతి, ఆమె మైనర్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..