Insulin: ఇన్సులిన్‌ అంటే ఏమిటీ.. డయాబెటీస్‌ ఎందుకు వస్తుంది.. కారణాలు తెలుసుకోండి..?

Insulin: మనం ఇన్సులిన్ అనే పదాన్ని తరచూ వింటుంటాం. డయాబెటీస్‌ విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ లోపం ఉందని లేదా

Insulin: ఇన్సులిన్‌ అంటే ఏమిటీ.. డయాబెటీస్‌ ఎందుకు వస్తుంది.. కారణాలు తెలుసుకోండి..?
Insulin
Follow us
uppula Raju

|

Updated on: Nov 07, 2021 | 8:14 PM

Insulin: మనం ఇన్సులిన్ అనే పదాన్ని తరచూ వింటుంటాం. డయాబెటీస్‌ విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఒక వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ లోపం ఉందని లేదా ఇన్సులిన్ చాలా పెరిగిందని వైద్యులు చెబుతుంటారు. ఇన్సులిన్‌ను తగ్గించడానికి మన చుట్టూ ఉన్నవారు తరచుగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం లేదా మందులు వేసుకోవడం మనం చూసే ఉంటాం. కానీ మనలో చాలా మందికి ఇన్సులిన్ అంటే ఏమిటి అది శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలియదు. ఈ ముఖ్యమైన హార్మోన్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఇన్సులిన్ అంటే ఏమిటి సరళంగా చెప్పాలంటే ఇన్సులిన్ అనేది ఒక రకమైన హార్మోన్. ఇది కార్బోహైడ్రేట్లు, కొవ్వును శక్తిగా మార్చడానికి పనిచేస్తుంది. అంటే మనం ఏది తిన్నా అది శక్తిగా మారినప్పుడే శరీరం కండీషన్‌లో ఉంటుంది. మన ఆహారంలో ప్రధాన భాగమైన కార్బోహైడ్రేట్లు అత్యధిక శక్తిని అందిస్తాయి. ఆ కార్బోహైడ్రేట్లను ఇన్స్‌లిన్‌ శక్తిగా అంటే గ్లూకోజ్‌గా మార్చి మన శరీరంలోని వందలాది కణాలకు రవాణా చేస్తాయి. శరీరంలో ఇన్సులిన్ నిష్పత్తి క్షీణించినప్పుడు అంటే అది పెరగడం లేదా తగ్గే పరిస్థితిని డయాబెటిస్ అంటారు. ఇది టైప్ 1, టైప్ 2 అని రెండు రకాలుగా ఉంటుంది.

ప్యాంక్రియాస్ దగ్గర ఇన్సులిన్  పేగుల పైన, ఉదరం ఎడమ భాగంలో ఒక అవయవం ఉంటుంది. దీనిని ప్యాంక్రియాస్ అంటారు. ఇక్కడే ఇన్సులిన్ తయారవుతుంది. ప్యాంక్రియాస్ మన కాలేయంతో కలిసి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మనం ఏదైనా తిన్నప్పుడల్లా కాలేయం పాంక్రియాస్‌కు ఎక్కువ ఇన్సులిన్ అవసరమని సందేశం పంపి క్లోమం, ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసి వెంటనే శరీరానికి సరఫరా చేస్తుంది. తద్వారా మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారుతుంది. ప్యాంక్రియాస్ హైపర్యాక్టివిటీ లేదా అండర్ యాక్టివిటీని మెడికల్ సైన్స్ భాషలో డయాబెటిస్ అంటారు.

ఇన్సులిన్ ఆవిష్కరణ ఇన్సులిన్, శరీరంలో దాని పాత్ర పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో కనుగొన్నారు. ఇది వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఒక అద్భుతం. ఇది మధుమేహం కారణం, చికిత్స రెండింటినీ అర్థం చేసుకోవడం సులభతరం చేసింది.

త్వరలో 2000 మందికి ఉద్యోగాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ..

Zika Virus: జికా వైరస్ హెచ్చరిక.. కొత్తగా13 కేసులు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం.. ఎంత తగ్గించారంటే..