Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zika Virus: జికా వైరస్ హెచ్చరిక.. కొత్తగా13 కేసులు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు

Zika Virus: కాన్పూర్‌లో జికా వైరస్ ముప్పు నిరంతరం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మహిళలు, 6 మంది చిన్నారులు

Zika Virus: జికా వైరస్ హెచ్చరిక.. కొత్తగా13 కేసులు.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు
Zika Virus
Follow us
uppula Raju

|

Updated on: Nov 07, 2021 | 7:25 PM

Zika Virus: కాన్పూర్‌లో జికా వైరస్ ముప్పు నిరంతరం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13 జికా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మహిళలు, 6 మంది చిన్నారులు వ్యాధి బారిన పడ్డారు. దీంతో మొత్తం సోకిన వారి సంఖ్య 108కి చేరింది. జికా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ ద్వారా యాంటీ లార్వా స్ప్రే నిరంతరం కొనసాగుతోంది. దీంతో పాటు కాన్పూర్ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని ఐ-ట్రిపుల్ సిలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నుంచి జికా వైరస్ సోకిన రోగులను 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ బృందం నిరంతరం వారికి రక్షణ కల్పిస్తోంది.

కరోనా మాదిరిగానే జికా వైరస్ రోగులను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కాన్పూర్‌లో రానున్న కాలంలో మరింత మంది జికా వైరస్‌ సోకే అవకాశాలు ఉన్నాయి. కాన్పూర్‌లో ప్రస్తుతం108 మంది జికా వైరస్ పాజిటివ్ రోగులు ఉన్నారు. వ్యాధితో పోరాడుతున్న వారికి కౌన్సెలింగ్ చాలా అవసరమని కంట్రోల్ రూమ్ ఇన్‌ఛార్జ్ ప్రతీక్ మిశ్రా అన్నారు. జికా వైరస్ సోకిన వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. జ్వర పీడితులు ఆసుపత్రుల్లో చేరారు. ప్రతీక్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఒక ఆడపిల్ల కాశీరామ్ ఆసుపత్రిలో చేరింది. అదే సమయంలో ఇద్దరు రోగులు ఎయిర్‌ఫోర్స్ ఆసుపత్రిలో చేరారు.

12 ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ బృందాలు జికా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు కాన్పూర్‌లోని 12 ప్రాంతాల్లో బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. అందరి కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా జరుగుతోంది. అదే సమయంలో నిఘా బృందం నమూనాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. ఈ 12 ప్రాంతాలలో 13 కొత్త సోకిన రోగులు తెరపైకి వచ్చారు. ఈ ప్రాంతాలలో దోమల నివారణకు ప్రతిరోజూ మందులు పిచికారీ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం 6 కిలోమీటర్ల పరిధిలో దోమల నివారణకు కృషి చేస్తున్నాయి. ఇక్కడ 100 బృందాలు ఫోకల్ స్ప్రే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

SBI PET Admit Card 2021: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Zika Dengue Swine Flu: పెరుగుతున్న వైరస్‌ల ముప్పు.. డెండ్యూ, స్వైన్‌ ఫ్లూ, జికా మధ్య లక్షణాల్లో తేడాలివే..

ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం మానేసి సాగు బాట పట్టింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది..