Home Remedies for Stone Problems: కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్యలా? వీటి ద్వారా ఉపశమనం పొందండి..!

Home Remedies for Stone Problems: సమయపాలన లేని ఆహారం, జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Home Remedies for Stone Problems: కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్యలా? వీటి ద్వారా ఉపశమనం పొందండి..!
Kidney Stones
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2021 | 6:27 PM

Home Remedies for Stone Problems: సమయపాలన లేని ఆహారం, జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా శరీరంలోని కిడ్నీ, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడి మనిషి తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తోంది. వాటి వల్ల మనిషి భరించలేని నొప్పిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే.. శస్త్రచికిత్స తప్ప మేరే మార్గం లేదు. మరోవైపు కిడ్నీలోనూ పెద్ద పరిమాణంలో రాళ్లు ఏర్పడితే అప్పుడు కూడా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. అయితే, మూత్రపిండాల్లో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను శస్త్రచికిత్స ద్వారా కాకుండా మెడిసిన్స్, ఇంట్లో లభించే సహజ పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలు పాటించడంతో పాటు.. ఓపిక చాలా అవసరం. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను ఎలా తొలగించుకోవాలంటే..

1. మీరు పత్తర్ చట్టా మొక్క.. మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. ఈ చెట్టు ఆకుని తీసుకుని దానికి కొద్దిగా చక్కెర కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ ఆకు మిశ్రమాన్ని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకోవడం వల్ల రాయి త్వరగా కరిగి బయటకు వచ్చేస్తుంది.

2. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో సగం నిమ్మకాయను పిండుకుని తాగితే మూత్రం ద్వారా రాళ్లు సులభంగా బయటకు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

3. పెద్ద ఏలకులను పొడి చేసి.. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్ఫూన్ పొడిని అందులో కలపాలి. దాంతోపాటు ఒక టీస్ఫూన్ చక్కెరను, కొన్ని పుచ్చకాయ గింజలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని బాగా నమిలి తినాలి. తరువాత ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

4. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు బయటకు రావాలంటే.. ఉదయాన్నే పరిగడుపున ముల్లంగిని తినాలి. రోజులో ఎక్కువ నీళ్లు తాగాలి. ఇలా కొన్ని రోజులు కొనసాగిస్తే.. కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

5. ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయను పిండి, అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపండి. బాగా మిక్స్ చేసి తాగాలి. నిమ్మరసం రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. ఆలివ్ నూనె ఆ రాళ్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

6. యాపిల్ వెనిగర్‌లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లను చిన్న రేణువులుగా కట్ చేస్తుంది. గోరువెచ్చని నీటితో రెండు టీస్పూన్ల వెనిగర్ తీసుకుంటే రాళ్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: దీనికి ఎలాంటి ప్రామాణికత లేదు. అనాదిగా వస్తున్న ఆయుర్వేద విధానాలను ఆధారంగా చేసుకుని దీనిని ప్రచురించడం జరిగింది. వీటిని పాటించే ముందు నిపుణులను తప్పక సంప్రదించండి.

Also read:

Urination Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా?.. ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..!

SBI PET Admit Card 2021: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Wife and Husband: మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే అనుమానం కలుగుతుందా? అయితే ఇవి తెలుసుకోండి..!