Wife and Husband: మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే అనుమానం కలుగుతుందా? అయితే ఇవి తెలుసుకోండి..!

Family Disputes: హిందూసంప్రదాయం ప్రకారం.. వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. ఆ బంధాన్ని నిలుపుకోవడం, కలకాలం సంతోషంగా ఉండటం దంపతులిద్దరి చేతుల్లో ఉంటుంది.

Wife and Husband: మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే అనుమానం కలుగుతుందా? అయితే ఇవి తెలుసుకోండి..!
Wife And Husband
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2021 | 6:19 PM

Family Disputes: హిందూసంప్రదాయం ప్రకారం.. వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. ఆ బంధాన్ని నిలుపుకోవడం, కలకాలం సంతోషంగా ఉండటం దంపతులిద్దరి చేతుల్లో ఉంటుంది. వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం ఉండాలి. అప్పుడే ఆ బంధం మరింత బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా దంపతులిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లుగా మసలుకోవాలి. ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడితే.. వెంటనే వాటిని పరిష్కరించుకోగలే స్థితిలో ఉండాలి. అలా అయితే, ఆ బంధం మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది.

అయితే, ప్రస్తుతం కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న విషయాల్లోనే మనస్పర్థలు పెంచుకుని విడాకుల దాకా తెచ్చుకుంటున్నారు దంపతులు. వందేళ్లు హాయిగా కాపురం చేయాల్సింది.. పట్టుమని పదేళ్లు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. దానికి కారణం అనేకం ఉన్నాయి. అదే వేరే విషయం అనుకోండి. అయితే, ఇప్పుడు మనం ప్రత్యేక విషయం గురించి తెలుసుకుందాం. చాలామంది జంటలు పైళ్లయిన కొత్త చాలా అన్యోన్యంగా, ప్రేమగా, సరదాగా ఉంటారు. ఇతరులు చూసి ఔరా ఏం జంట.. ఉంటే వీరిలా ఉండాలి అనుకునే రేంజ్‌లో జీవితాన్ని ఆస్వాధిస్తుంటారు. అయితే, ఆ తరువాతే అసలు సినిమా ప్రారంభం అవుతుంది. కొందరు దంపతులు జీవితాంతం అలాగే కలివిడిగా ఉంటే.. కొందరు మాత్రం మొదట్లో మంచిగా ఉండి ఆ తరువాత మారిపోతారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు.. తమ భర్తలు తమను పట్టించుకోవడం లేదనే కంప్లైంట్‌లు వినిపిస్తుంటాయి. ‘నా భర్త నన్ను ఇదివరకట్లా పట్టించుకోవడం లేదు.. నామీద మా ఆయనకు ప్రేమ తగ్గిపోయింది.’ ఇలా రకరకాల ఫిర్యాదులు నిత్యం చూస్తూనే ఉంటాయి. ఇంకొంతమంది అయితే, దీనిని సీరియస్‌గా తీసుకుని తీవ్ర బాధలో కూరుకుపోతుంటారు.

నిజంగానే మీ భర్త.. మీపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడా? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.. మీ భర్త అసలు మిమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేసున్నారో, దానికి కారణాలేంటో ముందుగా మీరు తెలుసుకోవాలి. ఇదే అంశంపై వారితో ఫ్రీగా మాట్లాడాలి. అసలు సమస్యేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏమైనా సమస్యలున్నాయా? వర్క్ ప్రెషర్స్ ఉన్నాయా? వంటివి తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీరు మీ భర్తతో ప్రొసీడ్ అవ్వాలి. ముఖ్యంగా భర్త కుటుంబ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వాలి. అప్పుడు మీ భర్తకు మీపై అపార గౌరవం ఏర్పడుతుంది. ఉద్యోగం, పని చేసే వారు పని ఒత్తిడికి లోనవుతుంటారు. ఆ టెన్షన్‌లో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించే మగవారెందరో ఉంటారు. అందుకని, ఆ విషయాలు కూడా తెలుసుకుని, అందుకు తగ్గట్లుగా మసలుకోవాలి. ఏవైనా సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే.. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. వీలైనంత వరకు పరిస్థితులను అర్థం చేసుకుని, దాంపత్యంలోని సమస్యలను పరిస్కరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ జంటపైనా ఉంటుంది. అపార్థాలకు వెళ్లకుండా.. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.. కాపురాన్ని హాయిగా మలచుకోండి.(నోట్: మగవారికి కూడా ఇవే సూచనలు వర్తిస్తాయని గమనించాలి.)

Also read:

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా..

Zika Dengue Swine Flu: పెరుగుతున్న వైరస్‌ల ముప్పు.. డెండ్యూ, స్వైన్‌ ఫ్లూ, జికా మధ్య లక్షణాల్లో తేడాలివే..

Yoga Poses : ఈ 3 యోగాసనాలను క్రమం తప్పకుండా సాధన చేయండి.. రక్తప్రసరణను మెరుగుపరచుకోండి..

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది