Yoga Poses : ఈ 3 యోగాసనాలను క్రమం తప్పకుండా సాధన చేయండి.. రక్తప్రసరణను మెరుగుపరచుకోండి..

Yoga Poses : శరీరంలో రక్తప్రసరణ సరిగా సాగకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

Yoga Poses : ఈ 3 యోగాసనాలను క్రమం తప్పకుండా సాధన చేయండి.. రక్తప్రసరణను మెరుగుపరచుకోండి..
Representative Image
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 07, 2021 | 6:05 PM

Yoga Poses : శరీరంలో రక్తప్రసరణ సరిగా సాగకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. రక్తమే శరీరానికి, అవయవాలకు అవసరమైన పోషకాలను, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. అలాంటిది రక్త ప్రసరణ సక్రమంగా లేకపోతే.. పరిస్థితి వేరేలా మారిపోతుంది. అందుకే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు.. శారీరక శ్రమ కూడా చాలా అవసరం. ముఖ్యంగా యుగ యుగాల నుంచి నుంచి వస్తున్న యోగ ఆసనాలు.. శరీరంలో రక్తప్రసరణను మెరుగు పరచడానికి ఎంతగానో దోహదపడుతాయి. యోగాలో కీలకమైన 3 యోగాసనాలను ప్రతి రోజూ సాధన చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మూడు యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వజ్రాసనం: వజ్రాసనం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఆసనం ద్వారా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. బొటన వేళ్ల నుంచి తల వరకు రక్త ప్రసరణ ఎటువంటి ఆటంకం లేకుండా జరుతుంది.

పశ్చిమోత్తనాసనం : ఈ ఆసనం కూడా రక్తప్రసరణను మెరుగుపరచడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, కోపం, చిరాకును తొలగించి.. మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. వెన్నెముకు సాగదీస్తుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలను నివారణకు ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది.

కపాల్భాతి: ఈ ఆసనం జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. ఉదర కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే నాసికా భాగాలను బలపరుస్తుంది. అలాగే ఛాతిలోని అడ్డంకులను తొలగిస్తుంది. చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును తొలగించి.. రక్త ప్రసరణకు ఎటువంటి ఆటంకం లేకుండా చేయడంతో ఉపకరిస్తుంది.

Also read:

ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం మానేసి సాగు బాట పట్టింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తుంది..

CM KCR: రాత్రి 7 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రెస్‌మీట్.. ఈ అంశాలపై..

Viral Video: నాగుపాము, కొండచిలువ మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారో చూడండి..

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా
శీతాకాలంలో పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు..క్యాన్సర్‌కు కూడా